అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ చిత్రం ఫ్లాప్‌తో తదుపరి చిత్రంగా ఏ చిత్రానిన చేయాలో పాలు పోవడం లేదు. ఇప్పటి వరకు విక్రమ్ కుమార్‌తో పాటు ఎంతో మంది దర్శకుల పేర్లను పరిశీలించిన అల్లు అర్జున్ చివరకు పరుశురామ్‌తో కూడా సినిమా చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. విజయ్ దేవరకొండ, రష్మీక మందన జంటగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రాన్ని పరుశురామ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించాడు. ఈయన గత చిత్రం కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే గీత గోవిందం చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలోనే అల్లు అర్జున్ దర్శకుడు పరుశురామ్‌పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
‘గీత గోవిందం’ చిత్రం ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించాడు. ఈ చిత్రం విడుదలకు ముందే భారీ క్రేజ్‌ను దక్కించుకుంది. విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందనల మద్య రొమాంటిక్ సీన్స్‌తో పాటు మంచి కథతో దర్శకుడు పరుశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దాంతో ఈ చిత్రం తప్పకుండా విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంతో మెగా వర్గాల వారు ఉన్నారు. గీత గోవిందం సమయంలోనే అల్లు అరవింద్‌కు దర్శకుడు పరుశురామ్ ఒక కథను చెప్పాడని, ఆ కథ బాగా నచ్చడంతో అల్లు శిరీష్ కోసం దాన్ని అల్లు అరవింద్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడే అదే కథను అల్లు అర్జున్‌తో చేసే విషయమై పరిశీలిస్తున్నాడు. గీత గోవిందం సక్సెస్ అయితే ఖచ్చితంగా అల్లు అర్జున్‌తో పరుశురామ్ సినిమా ఉండే అవకాశం ఉంది.