పరిచయం మూవీ రివ్యూ

PARICHAYAM Movie Review And Rating

నటీనటులు: విరాట్ కొండూరు, సిమ్రాట్ కౌర్, సిజ్జు, రాజీవ్ కనకాల, పృథ్వీ, పరుచూరి వెంకటేశ్వరరావు, తదితరులు

దర్శకుడు: లక్ష్మీకాంత్ చెన్న

సినిమాటోగ్రఫీ: నరేష్ రాణా

సంగీతం: శేఖర్ చంద్ర

ఎడిటింగ్: ప్రవీణ్ పూడి

నిర్మాత: రియాజ్

కథ:

ఆనంద్(విరాట్ కొండూరు), లక్ష్మి(సిమ్రాట్ కౌర్) ఇద్దరూ ఇరుగు పొరుగు ఇంట్లో ఉండేవాళ్ళు. రాజీవ్ కనకాల ఆనంద్ తండ్రి, పృథ్వీ లక్ష్మి తండ్రి. ఆనంద్, లక్ష్మి ఇద్దరరూ కూడా ఒకే రోజు, ఒకే హాస్పిటల్ లో, దగ్గర ఒకే సమయంలో పుడతారు. అయితే, ఇద్దరూ కూడా చిన్నప్పటి నుండి కలిసి ఉండేవాళ్ళు, కలిసి ఒకే స్కూల్ లో చదువుకుంటారు. ఇద్దరూ ఒకే కాలేజీలో చేరతారు. నెమ్మది నెమ్మదిగా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడడం మొదలుపెడతారు, కానీ ఒకరికొకరు చెప్పుకోరు. అయితే, లక్ష్మి ఆనంద్ ని ప్రేమిస్తుందని తెలుసుకున్న లక్ష్మి నాన్న తనని ఆనంద్ తో మాట్లాడకుండా వారిస్తాడు. అప్పుడు, లక్ష్మి పాయిజన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుంటుంది. తనని హాస్పిటల్ లో జాయిన్ చేసిన తరువాత, తమ మాట కాదనిందని, లక్ష్మిని తన తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు, ఆనంద్ తనని తీసుకొని  కాకినాడ వెళ్లిపోతాడు. తనని మామూలు మనిషిని చేయడానికి ఆనంద్ పడిన కష్టాలు ఏంటి?, తమ ప్రేమని ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అన్నదే మిగిలిన కథ.

Parichayam review and rating

పరిశీలన:

గతంలో ‘నిన్న నేడు రేపు’, ‘హైదరాబాద్ నవాబులు’ వంటి  భిన్న చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్న ఈ సారి ఒక ప్రేమకథను  తీసుకొచ్చాడు. అయితే, ఈ ప్రేమకథ తెలిసిన కథలా అనిపించడం, ఎంత నిజమయిన కథ అని చెప్పినా, ఇంతకుముందే ఇలాంటి టచ్ ఉన్న కథలను మనం చూసేయడం ఈ సినిమాను కొత్తగా అనిపించేలా చేయడం లేదు. హీరో, హీరోయిన్ లు ప్రేమించుకోవడం, వాళ్ళ ఇళ్లల్లో ఒప్పుకోకపోవడం లాంటివి ఎప్పటి నుండో ఉన్న కథలే. అయితే,  ప్రేమ కథ కావడం చేత కొంత ప్రేక్షకులకి నచ్చే అవకాశం ఉంది. దర్శకుడు చాలా వరకు, సన్నివేశాన్ని పండించడం కోసం చేసిన ప్రయత్నం కథనాన్ని చూపించడంలో చేయలేదేమో అన్న సందేహం వ్యక్తమవుతుంది. సాదాసీదా కథనంతో నడవడం వాళ్ళ ప్రేక్షకుడు కావాలనుకునే కొత్తదనం ‘పరిచయం’ కాలేదేమో అనిపిస్తుంది. అయితే, కొన్ని సార్లు కొత్తదనం లేకపోయినా భావోద్వేగాలు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. ఆ రకంగా చూస్తే, ఈ సినిమా అలాంటి భావోద్వేగాలను బాగానే ‘పరిచయం’ చేసిందనవచ్చు. ఫస్ట్ హాఫ్ లో సామాన్య ప్రేమకథను చూపించిన దర్శకుడు, సెకండ్ హాఫ్ లో భావోద్వేగాలకు పెద్దపీట వేసాడు. సినిమాలో ఉండే కొన్ని కథనాలు జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంటాయి.

Parichayam review & rating

కథని నెమ్మదిగా తీసుకువెళ్లడం, కథనంలో కొత్తదనం కొరవవడం కొంచెం నిరుత్సాహపరిచే విషయాలు. కానీ, ప్రేమలో ఉండే నిజాయితీ, బాధ, స్వచ్ఛత చూపించడంలో మాత్రం సఫలం అయ్యాడు అనడంలో అతిశయోక్తి లేదు. రెగ్యులర్ ఫార్మట్ నుండి బయటకు వచ్చి కొత్త కథలను చూద్దాం అనుకునేవారిని ఈ సినిమా సంతృప్తి పరచకపోవచ్చు. కానీ, రెగ్యులర్ ఫార్మట్ అయినా ఫర్లేదు లవ్ ఫీల్ కావాలనుకునేవాళ్ళకి ఈ సినిమా నచ్చవచ్చు. మునుపటి సినిమాల కథలతో దీనిని పోల్చడం వల్ల ఇది కచ్చితంగా కొత్తగా అనిపించదు కానీ, మంచి ప్రేమ భావాన్నే ‘పరిచయం’ చేసిందని అనిపిస్తుంది.

విరాట్ తన పాత్రకు న్యాయం చేశాడు, తనని తాను నిరూపించుకున్నాడు. భావోద్వేగభరిత సన్నివేశాల్లో బాగా చేసాడు. సిమ్రాట్ కూడా బాగానే చేసింది, అందంగా కూడా ఉంది. రాజీవ్ కనకాల, పృథ్వీలు బాగానే చేశారు. చంద్ర శేఖర్ సంగీతం చాలా బావుంది. అలాగే, నరేష్ రాణా కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది.

ప్లస్ పాయింట్స్: యాక్టర్స్ పెర్ఫార్మన్స్, సంగీతం, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్: తెలిసిన కథ, నెమ్మదిగా ఉన్న కథనం

తెలుగు బుల్లెట్ రేటింగ్: 2.5/5

తెలుగు బుల్లెట్ ‘పంచ్ లైన్’ – “పరిచయం…. పాతదే”