అధికారంలోకి రావడం ఇంత వీజీనా….స్వామి వారి ప్రవచనం విన్నారా…?

Paripoornananda To Enter Politics With Bjp

ఈ ఎన్నికల్లో వోటుకు ఎంత పంచాలి, ఒకప్పటి పెద్ద నోట్లు ఇప్పుడు లేవు కాబట్టి రెంవు వేలే దిక్కు అని ఒక పక్క పార్టీల అభ్యర్ధులు గగ్గోలు పెడుతుంటే భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తానని అదీ కూడా 30 రోజుల్లోనే అని అమిత్ షాకు మాటిచ్చాని కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన పరిపూర్ణానంద చెప్పిన లెక్కకి మాత్రం దిమ్మతిరిగిపోవడం ఖాయం ఎందుకంటే చౌటుప్పల్ లో నిర్వహించిన రోడ్ షో లో పాల్గొన్న పరిపూర్ణానంద, తన అనుచరుడితో మాట్లాడుతూ ఇక్కడి ప్రజలు 200 రూపాయలు ఇస్తే కానీ సభలకురారని ఇక్కడి వాళ్ళు డబ్బులు ఇవ్వరని మనమే వాళ్లకు ఇవ్వాలని చెప్పారు.

Paripoornananda-To-Enter-Po

20 వేల ఓట్లు వస్తే చాలని 200 చొప్పున ఇస్తే 20 వేల ఓట్లు తప్పకుండా వస్తాయన్నారు. అయితే పరిపూర్ణానంద ముందు చెప్పిన మాటలు విని కాన్ఫిడెన్స్ పెంచుకున్న బీజేపీ నేతలు తాజా వ్యాఖ్యలతో బిత్తర పోతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు నెక్ట్స్ సీఎం తానే అన్నంతగా హడావుడి చేసిన ఆయన రాజకీయ జ్ఞానం చూసి వారికీ ఏమి మాట్లాడాలో అర్ధం కావట్లేదట పాపం. టీఆర్ఎస్ నేతలు నేరుగా ఆ వీడియోను ఈసీ దగ్గరకు తీసుకెళ్లి కంప్లైంట్ యిచ్చేశారు. సహజంగా స్వామి ప్రతి మాటను రికార్డు చేసుకోవడానికి సొంత టీమ్‌ను పెట్టుకున్నారు. అలా వాళ్లు రికార్డు చేసుకున్నారు.

Paripoornananda-amithshsah

అయితే స్వామి వారి రూ. రెండు వందల ప్రవచానికి మంచి ప్రాచుర్యం రావాలని అనుకున్నారో లేక వినక పోవడం వల్లనేమో గానీ దాన్ని తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. దీంతో ఇప్పుడు స్వామి వారి రాజకీయ వేషం బయటకు వచ్చేసింది. అయితే ఈ వీడియో ఆధారంగా ఈసీకి ఫిర్యాదు వెళ్లడంతో ఆ వీడియో తీసిన ఆయనకు చెందిన భారత్ టుడే చానల్ భుజాలు తడుముకుంది. ఇదంతా స్వామి వారి మీద దుష్ప్రచారం అంటూ చాలా సేపు ప్రోగ్రాం నడిపించారు. కానీ ఆ వీడియో అబద్దమని.. అందులో స్వామి వారు అలా అనలేదేని చెప్పుకోలేకపోయారు. దీంతో స్వామి ఇప్పుడు పూర్తిగా పొలిటికల్ స్వామి అనిపించారు.

Paripoornananda