నోట్ల రద్దు పై సినిమా వచ్చేస్తోంది… బీజేపీ ఊరుకుంటుందా ?

Party Tamil movie Teaser released BJP Angry on that movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
జీఎస్టీ గురించి తమిళ్ స్టార్ హీరో విజయ్ మెర్సెల్ సినిమాలో ఒకటి రెండు డైలాగ్స్ పెడితేనే బీజేపీ భగ్గుమంది. సెన్సార్ అయ్యాక కూడా కొన్ని డైలాగ్స్ తీసేసేలా ఫిలిం యూనిట్ మీద ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయ్యింది. అలాంటి బీజేపీ కి ఓ బాడ్ న్యూస్. నరేంద్రమోడీ దేశగతిని మార్చేస్తుందని తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అంశం చుట్టూ ఏకంగా ఓ సినిమానే వచ్చేస్తోంది. విలక్షణ సినిమాలు తీసే దర్శకుడు వెంకట్ ప్రభు” పార్టీ” పేరుతో తీస్తున్న సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు మీద చేస్తున్న ప్రకటనతో రావడం సంచలనం రేపుతోంది.

Venkatesh-Prabhu-Party-movi

నిజానికి క్రైమ్ థ్రిల్లర్స్ తీయడంలో వెంకట్ ప్రభు టాలెంట్ కి అప్పుడెప్పుడో తీసిన సరోజ పెద్ద ఉదాహరణ . ఇప్పుడు పార్టీ సినిమా కూడా అలాంటి క్రైమ్ థ్రిల్లర్. అయితే కధ, కధనం మోడీ తీసుకున్న నోట్ల రద్దు పరిణామాల చుట్టూ తిరగడంతో బీజేపీ కూడా ఈ టీజర్ మీద ఓ కన్ను వేసే అవకాశం లేకపోలేదు. మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా వున్నా జీఎస్టీ సహా వివిధ విషయాలపై కేంద్ర ప్రభుత్వ విధానాలను గట్టిగా వ్యతిరేకిస్తున్న వారిలో తమిళ సినీ రంగ ప్రముఖులు ముందు వుంటున్నారు. రాజకీయాల మీద ఆసక్తి చూపుతున్న కమల్ లాంటి వాళ్ళు బీజేపీ మీద సీరియస్ విమర్శలు చేస్తున్నారు. ఇక బీజేపీ భావజాలానికి దగ్గరగా ఉంటారని భావించిన రజనీకాంత్ సైతం తమిళ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆ నిర్ణయం నుంచి డ్రాప్ అయ్యారు. ఇక ఇప్పుడు పార్టీ సినిమా టీజర్ మీద బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. బీజేపీ లో కలవరం రేపుతున్న పార్టీ టీజర్ మీద మీరు కూడా ఓ లుక్ వేయండి.