మాతో ఉంటే దేశభక్తులు.. లేకపోతే దేశ ద్రోహులు’ అన్నట్టుంది పరిస్థితి !

Patriots with us Otherwise, the traitors seem to be using the situation!

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీకి పరోక్షంగా చురకలు అంటించారు. మాతో ఉంటే దేశభక్తులు.. లేకపోతే దేశ ద్రోహులు అనే పరిస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొందని వ్యాఖ్యానించారు.

నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన తెలంగాణ వికాస సమితి రాష్ట్ర మహాసభలకు ఆయన ముఖ్య అథితిగా హజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ గాడ్సే దేశ భక్తుడు అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆమె వ్యాఖ్యలను ట్విటర్ వేదికగా ఖండించిన సందర్బంలో, ప్రజ్ఞా సింగ్ మాటలను సమర్థిస్తూ వచ్చిన కామెంట్లు తనను చాలా బాధించాయని అన్నారు.

జాతిపిత మహాత్మా గాంధీని గౌరవించుకోలేని జాతి మనది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మతం వ్యక్తిగతమైనదనీ, లౌకిక రాజ్య వ్యవస్థతో మతానికి సంబంధం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. భారత్ మత ప్రాతిపదిక దేశం కాదనీ, పూర్తిగా లౌకిక దేశమని గుర్తు చేశారు.

మతం, రాజకీయం, జాతీయ వాదం అనేవి పరస్పరం విడదీయలేనంతగా పెనవేసుకున్న పరిస్థితులు రావడం దురదృష్టకరమన్నారు. ప్రతీకూల శక్తులు, అనుకూల శక్తులకు జరిగే సంఘర్షణే చరిత్ర అని ఎప్పుడూ సీఎం కేసీఆర్‌ చెబుతూ ఉంటారని ఆయన గుర్తుచేసుకున్నారు.