పవన్ కి ఆ మాత్రం దమ్ము లేదా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర వాసుల్ని రెచ్చగొడుతున్నారు అనిపిస్తోంది. ఉత్తరాంధ్ర వెనుకబడిపోయిందని ఆవేశంతో ప్రసంగిస్తూ మధ్యమధ్యలో గుండెలు బాదేసుకుంటూ తన పొలిటికల్ యాత్రను బాగానే రక్తి కట్టిస్తున్నారు. తెలంగాణలా ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం వస్తుందని ఎప్పటికైనా ప్రత్యేక రాష్ట్రం ఖాయమని నిన్న తేల్చి పారేశారు సరే కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏం అన్యాయం జరిగిందో పవన్ సహా చర్చల్లో పాల్గొన్న మేధావులెవరూ(పవన్ తో సహా) చెప్పలేకపోయారు. ఏపీ మొత్తం ఉన్న సమస్యలే ఉత్తరాంధ్రలోనూ ఉన్నాయి. అవే తాగునీరు, నిరుద్యోగం లాంటివి కానీ ఒక్క ఉత్తరాంధ్రలో ఉన్నట్లే పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. వెంటనే ఆయన సమావేశానికి రమ్మనగానే దేని గురోంచి వచ్చేసిన మేధావులు తలలు ఊపారు.

సరే ఇదంతా బాగానే ఉంది అనుకుందాం కానీ ఉత్తరాంధ్రను అత్యంత దారుణంగా మోసం చేసిన రెండు ఘటనలపై పవన్ సహా మేధావులెవరూ మాట్లాడకపోవడం శోచనీయం. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వాసుల కల విశాఖ రైల్వే జోన్. దాని కోసం ఏళ్లుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఆ కల కలగానే మిగిలి ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీల్లో దాన్ని కూడా చేర్చారు. దీంతో ఇక ఆ కల సాకారం అవుతుందనే అనుకున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ను ఇంకా పరిశీలిస్తూనే ఉందట. చట్టంలో ఉంది కాబట్టి ఆ పరిశీలన కూడా చేస్తున్నామని వెటకారాలు చేశారు మన గౌరవ రైల్వే మంత్రి. ఉత్తరాంధ్ర వెనుకబడిపోయిందని రోజంతా చర్చలు జరిపిన మేధావులకు ఈ రైల్వేజోన్ అంశం, అసలు గుర్తుకు రాలేదా ? ఆ కేంద్ర మంత్రి వెటకారపు మాటలు కోపం తెప్పించ లేదా ?
మరో పక్క కేంద్రం ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాకు అత్యంత అవమానించిన మరో సందర్భంగా కూడా పవన్ మిళిత మేధావులు చర్చించలేపోయారెందుకు ? కేంద్రంని ప్రశ్నించే ధైర్యం చేయలేకపోయారెందుకు ? విభజన చట్టం ప్రకారం.. ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు.. కేంద్ర ఆర్థిక శాఖ కొన్నాళ్ల క్రితం రూ. 350 కోట్లు నిధులు విడుదల చేసింది. కానీ ఇచ్చినట్టే ఇచ్చి మోడీ కార్యాలయం మళ్లీ వెనక్కి తీసేసుకుంది. ఈ కుట్ర అంతా ఏపీ ప్రభుత్వం దీన్ని బయటపెట్టినా మళ్లీ ఆ నిధులు విడుదల చేయలేదు. ఉత్తరాంధ్ర వెనుకబాటుపై రోజంతా చర్చలు జరిపిన మేధావులకు(స్వయంప్రకటిత) ఈ అవమానం కనిపించలేదు కదా ? పాపం.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో కుమ్మక్కయ్యి రాష్ట్ర ప్రభుత్వం మీద టీడీపీ మీద విషం ప్రచారం చేస్తున్నారనేది తెలుగుదేశం అభియోగం, ఇప్పుడు పవన్ చేస్తున్న రాజకీయం కూడా దానికి బలం చేకూరుస్తోంది. రైల్వేజోన్, నిధులు ఇచ్చి వెనక్కి తీసుకున్న ఘటనలు జరిగితే కేంద్రాన్ని ప్రశ్నించడానికి దమ్ము చాలకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఎవరు ఎన్ని చెప్పినా ఏమి చేసినా పవన్ రాజకీయానికి పనికిరాడు అని సామాన్య ప్రజానీకానికి సైతం అర్ధం అవుతోంది, పాపం స్కూల్స్, కాలేజ్స్