శంకర్ ది పిచ్చా ? వెర్ర్రా ?

Shakalaka Shankar comments on Pawan Kalyan

కొందరు కమెడియన్లు పవన్ భజన చేస్తే చాలు ప్రపంచంతో పని లేకుండా తమ సినిమాలు ఆడేస్తాయి అన్న భావనలో ఉన్నట్టున్నారు. మొన్నటి సప్తగిరి కూడా పవన్ ని వాడుకునే మొదటి సినిమా వర్క్ అవుట్ చేసుకున్నాడు. కానీ రెండో సినిమా తేడా కొట్టేసరికి మూడోది తీస్తానన్న నిర్మాత అడ్రెస్ లేడు. ఇప్పుడు ‘శంభో శంకర’తో హీరో ఎంట్రీ ఇస్తున్న షకలక శంకర్ కూడా ఇదే బాపతులా ఉన్నాడు. ఇటీవలే ఆడియో ఫంక్షన్ లో దిల్ రాజ్ తో మొదలు పెట్టి అల్లు శిరీష్ దాకా తనను హీరోగా పెట్టి సినిమా తీయనందుకు వాళ్ళ గురించి అతిగా మాట్లాడి నవ్వులపాలైన శంకర్ ఇప్పుడు పవన్ ఫాన్స్ ని ప్రసన్నం చేసుకునేందుకు జనసేన పార్టీలో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ సహా తెలుగుదేశం ఎమ్మెల్యే గా ఉన్న చంద్రబాబు వియ్యంకుడు స్టార్ హీరో బాలకృష్ణ కూడా పవన్ దారిలోకి వచ్చేస్తాడని చెప్తున్నాడు, ఇవన్నీ నవ్వుకోవడానికి భలే పనికొస్తున్నాయి కానీ అందరు జాయిన్ అవ్వాలని పిలుపు ఇవ్వడం జబర్దస్త్ మించిన కామెడీ అవుతోంది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ వీరాభిమానుల్లో ష‌క‌ల‌క శంక‌ర్ కూడా ఒకరు, ఒకప్పుడు జ‌బ‌ర్‌ద‌స్త్ స్కిట్టుల్లో ప‌వ‌న్‌ని బాగానే వాడేసుకున్నాడు. క‌థానాయ‌కుడిగా మారిన తొలి సినిమాలోనూ ప‌వ‌న్‌కి సంబంధించిన రిఫ‌రెన్సులు చాలా కనిపిస్తున్నాయి అన్నింటికి మించి భుజం మీద ఎర్ర కండువా వేసుకుని… దాని గొప్ప‌ద‌నం, విశిష్ట‌త ట్రైల‌ర్లో చెప్పేశాడు. ఈ సినిమా ప్ర‌చారం కోసం మీడియా ముందుకు వ‌స్తున్న శంక‌ర్ అల‌వాటు ప్ర‌కారం ప‌వ‌న్‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. రోజా, మ‌హేష్ అంటే ఫ‌ర్వాలేదు. బాలయ్య జ‌న‌సేన‌కు ఎందుకు స‌పోర్ట్ చేస్తాడు. ఆంధ్ర‌లో బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైకాపా జ‌ప‌సేన‌కు ఎందుకు స‌పోర్ట్ చేస్తుంది. ఈ మాట‌ల‌న్నీ వింటుంటే శంక‌ర్‌కి రాజ‌కీయ అవ‌గాహ‌న ఉందా, లేదా? అనిపిస్తోంది. ప‌వ‌న్‌పై అభిమానం ఉండొచ్చు. మ‌రీ ఈ స్థాయిలోనా? శంక‌ర్ మాట‌లు విని ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులే న‌వ్వుకుంటున్నారు. ఇక సామాన్యుల ప‌రిస్థితి వేరే చెప్పాలా…??