మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్ని రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. తాజాగా చిరంజీవి ఇంటికి జనసేన అధినేత, చిరు తమ్ముడు పవన్ కల్యాణ్ వెళ్లారు.
భార్య లెజెనోవా, పిల్లలతో కలసి జనసేనాని అన్నయ్య చిరు ఇంటికి వెళ్లారు. అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారి రెండు కుటుంబాలు కలిసి భోజనం చేసారని తెలుస్తోంది.అన్నదమ్ములిద్దరూ ఒకే చోట చేరడంతో, మెగా అభిమానుల ఆనందం రెట్టింపయింది.