“మాస్ లుక్ లో దూసుకొస్తున్న పవన్: ‘ఓజి’ స్టైల్!”

"Pawan in mass look: 'OG' style!"
"Pawan in mass look: 'OG' style!"

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒత్తి పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని అందరికి తెలిసిందే. ఇలా ఇప్పుడు పవన్ తన మూవీ లు కొన్ని నెలలు పక్కన పెట్టి తన ఉప ముఖ్యమంత్రి పదవిలో చాలా బిజీగా ఉన్నారు. అయితే పవన్ నటించిన లేటెస్ట్ మూవీ ల్లో మూడు ఆల్రెడీ సెట్స్ మీద ఉండగా వాటిని త్వరలోనే స్టార్ట్ చేస్తాను అని మేకర్స్ కు ప్రామిస్ చేసినట్టుగా టాక్ వచ్చింది.

"Pawan in mass look: 'OG' style!"
“Pawan in mass look: ‘OG’ style!”

అలా మొదటి వరుసలో అయితే తన భారీ మూవీ “ఓజి” నే మొదలు పెట్టనున్నట్టుగా టాక్ రాగా ఇప్పుడు సరిగ్గా ఇదే లుక్ లోకి పవన్ మారి కనిపించడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఏపీలో గవర్నమెంట్ సంబంధించి పనుల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కొత్త లుక్ ఇపుడు బయటకు వచ్చింది. దీనితో ఈ లుక్ లో మాత్రం మళ్ళీ పవన్ ఓజి లుక్ లోకి మారిపోయారు అని చెప్పాలి.

అయితే ఓజి మూవీ స్టార్ట్ అవ్వడానికి కొంచెం సమయం ఉందని రూమర్స్ ఉన్నాయి. అక్టోబర్ మొదటి నుంచి అలా పవన్ ఓజి ను రీస్టార్ట్ చేయనుండగా అక్కడ నుండి రెండు వారాల మేర డేట్స్ ను తాను ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఈ కొత్త మేకోవర్ మాత్రం ఇప్పుడు ఫ్యాన్స్ లో ఇప్పుడు వైరల్ గా మారింది.