Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Pawan Is A JanaSena Party Not Workout To say, That Political Leaders
అసలు జనసేన అనే పార్టీ ఉందని ఇప్పటికీ చాలా మంది ఏపీ జనానికి తెలియదు. వాళ్లకు తెలిసింది ఒక్కటే పవన్ అనే ఆయన బాబుకు మిత్రుడు. బాబును కలవలేకపోయిన వారికి ఈయన ఓ దారి. ఆయన ద్వారా చెప్పిస్తే పనౌతుంది అంతే. అందుకే పవన్ దగ్గరకు క్యూ కడుతున్నారు తప్పించి.. పవన్ సొంతంగా ఉద్ధరించేస్తారనే ఆశలు సొంత సామాజికవర్గానికి కూడా లేవు. కానీ పవన్ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి.
గతంలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు పవన్ యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆవేశపూరిత, ఆలోచన లేని ప్రసంగాలు చేశారు. గతంతో పోలిస్తే పవన్ లో కాస్త మెచ్యూరిటీ వచ్చిన మాట నిజమే అయినా.. రాజకీయ పరిణతి ఇంకా రావాలనేది విశ్లేషకుల మాట. అసలు పార్ట్ టైమ్ పాలిటిక్స్ ఐడియా ఆయనకు ఎవరిచ్చారో కానీ.. అది వర్కవుట్ కాదంటున్నారు పొలిటిల్ పండిట్స్.
పవన్ స్వతహాగా ఆవేశపరుడు. ఇది గతంలో ఉన్న ముద్ర. పవన్ చెప్పేదానికీ, చేసేదానికీ పొంతన లేదు. ఇది ఇప్పటి ముద్ర. అసలు పార్టీకి రూపు రాకముందే ఇలాంటి అభిప్రాయం జనంలో వస్తే ఇక భవిష్యత్ ఏంటనే బెంగ అప్పుడే జనసేన కోర్ టీమ్ కు మొదలైందట. పవన్ ఎప్పుడేం చేస్తారో ఎవరికీ తెలియదు. ఓ ప్రోగ్రామ్ ఇవ్వరు, ఓ షెడ్యూల్ ఇవ్వరు. ఇలా అయితే కష్టమేనంటున్నారు పవర్ స్టార్ సన్నిహితులు.
మరిన్ని వార్తాలు: