ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కరోనా వైరస్ నీ అడ్డుపెట్టుకొని కూడా రాజకీయాలు చేస్తున్నారు అని ఒకరి పై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడటానికి కారణం కూడా కరోనా వైరస్ అని చెప్పాలి. అయితే ఈ సమయంలో జనసేనా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజా ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అన్నారు. కరోనా వైరస్ పై అప్రమత్తం గా ఉండాలని రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పంతాలని వదిలి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పవన్ కోరారు. అయితే కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పలు మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలి అని వ్యాఖ్యానించారు. అయితే కరోనా నీ తేలికగా తీసుకోవద్దని, కేంద్రం చెప్పినట్లు అన్ని విద్యా సంస్థలను మూసి వేయాలని పవన్ అన్నారు. అయితే ప్రయాణికుల భద్రత దృష్ట్యా బస్టాండ్, రైల్వే స్టేషన్ లలో వైద్య బృందాలని నియమించాలని పవన్ కళ్యాణ్ కోరారు. అయితే ఈ విషయం లో పవన్ కళ్యాణ్ జనసెన పార్టీ తరపున, జనసైనికులకు ప్రణాళిక ఇచ్చినట్లుగా తెలిపారు.