మా తీరుపై పవన్‌ ఆగ్రహం

Pawan Kalyan Angry on Maa Association

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత కొన్నాళ్లుగా సినిమా పరిశ్రమ వ్యక్తులపై కొందరు చేస్తున్న విమర్శలపై ఎందుకు మా సీరియస్‌గా స్పందించడం లేదు అంటూ పవన్‌ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. నేడు ఉదయం ఫిల్మ్‌ ఛాంబర్‌కు వెళ్లిన పవన్‌ కళ్యాణ్‌ అక్కడ పలువురు సినీ ప్రముఖులతో పాటు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమా పరిశ్రమకు చెందిన తనను, తన తల్లిని తీవ్ర పదజాలంతో దూషించినప్పుడు ‘మా’ ఎందుకు సరిగా స్పందించలేదు అంటూ పవన్‌ ‘మా’ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

పవన్‌ కళ్యాణ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌కు వచ్చాడు అనే విషయం తెలిసిన వెంటనే ‘మా’ ప్రెసిడెంట్‌ శివాజీ రాజా షూటింగ్‌ నుండి హుటా హుటిన మా ఆఫీస్‌కు చేరుకోవడం జరిగింది. ఆ సమయంలోనే శివాజీ రాజా మాట్లాడుతూ పవన్‌ ఏం చెబుతాడో అంటూ తాము ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని, తాము పవన్‌కు మద్దతుగా ఉంటామని శివాజీ రాజా చెప్పుకొచ్చాడు. ‘మా’ తరపున చర్యలు తీసుకోవడం కాదని, దీనికి మొత్తం ఛాంబర్‌ ఉంటుందని, ఛాంబర్‌లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని శివాజీరాజా పేర్కొన్నాడు. మొత్తానికి పవన్‌ ఏం మాట్లాడుతాడు, ‘మా’పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడు అనేది ప్రెస్‌మీట్‌ అయితే తప్ప తెలియదు. ఇటీవలే మంచు విష్ణు తీవ్ర స్థాయిలో ‘మా’ పై విమర్శలు చేసిన విషయం తెల్సిందే.