ట్రెండ్‌ అవుతున్న #WithPk

Twitter Trending on #WithPK

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్‌ కళ్యాణ్‌ను, ఆయన తల్లిని శ్రీరెడ్డి తీవ్ర పదజాలంతో తిట్టడంతో మొదలైన వివాదం ప్రస్తుతం రాజకీయం దిశగా మరలింది. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక తాను ఉన్నట్లుగా వర్మ స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో వర్మ వెనుక టీడీపీ ఉంది అంటూ పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్స్‌ ద్వారా తెలియజేశాడు. నేడు ఉదయం వరుసగా పవన్‌ ట్వీట్స్‌ చేశాడు. ఆ ట్వీట్స్‌ చర్చనీయాంశం అవుతున్న సందర్బంలోనే పవన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌కు వెళ్లడం, అక్కడ దీక్ష చేస్తాడు అంటూ ప్రచారం జరిగింది. ఈ సమయంలోనే సోషల్‌ మీడియాలో విత్‌పీకే అంటూ ట్రెండ్స్‌ను మొదలు పెట్టారు. సినీ ప్రముఖులు మరియు రాజకీయ వర్గాల వారు అంతా కూడా పవన్‌కు మద్దతుగా ట్వీట్స్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం విత్‌పీకే హ్యాష్‌ట్యాగ్‌ సంచలనాత్మకంగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో గతంలో పలు రికార్డులు సృష్టించారు. ఇప్పుడు ఈ హ్యాష్‌ ట్యాగ్‌తో అంతా కూడా తాము పవన్‌ వెంట ఉన్నాం అంటూ తెలియజేస్తున్నారు. పవన్‌ చేస్తున్న ఆందోళనకు తాము మద్దతు తెలుపుతున్నట్లుగా అంతా ముందుకు వచ్చి ట్వీట్స్‌ చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఏ నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి తీర్మానం చేసినా కూడా ఫ్యాన్స్‌ అంతా ఆయన వెంట నిలుస్తాం అని అంటున్నారు. సినిమా పరిశ్రమకు చెందిన పెద్దలు కూడా పవన్‌ వెంట నిలిచేందుకు సిద్దం అవుతున్నారు. మొత్తానికి విత్‌పీకే సోషల్‌ మీడియా ఉద్యమం తీవ్ర స్థాయిలో ముందుకు సాగుతుంది.