పవన్ అంత హడావిడిగా ఫిలిం ఛాంబర్ కి వచ్చింది అందుకేనా ?

Pawan Kalyan and Mega Family protest at Film Chamber

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

క్యాస్టింగ్ కౌచ్ మీద పోరాటం చేస్తున్నా అనే పేరుతో ఒక ఉద్యమం ప్రారంభించానని భావించిన శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి తరువాత నాలుక కరుచుకుని తూచ్ ఇదంతా నాచేత రాం గోపాల్ వర్మ చెప్పించాడు. ఐదు కోట్లు ఇస్తాఅన్నాడు అంటూ వేరే ట్రాక్ లోకి విషయాన్ని పక్క దారి పట్టించిన సంగతి తెలిసిందే. అయితే వర్మ కూడా తానూ ప్రభావితం చేయడం వల్లే శ్రీ రెడ్డి ఇలా మాట్లాడింది అని ఒక విడియో రిలీజ్ చేయడం మరింత సంచలనానికి దారి తీసింది. అయితే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది అని ఆరోపిస్తూ పవన్ సైతం నిన్న అర్ధరాత్రి కొన్ని ట్వీట్లు చేశాడు.

అయితే ముందు నుండి కూడా పవన్ ని సైద్దాంతిక పరంగా విభేదిస్తున్న వారు సైతం పవన్ ని దూషించడం తప్పంటూ తమ వాయిస్ ని వినిపించారు. ఆ మాటలు అన్నప్పటి నుండి మెగా ఫ్యామిలీ నుండి ఒక్కరొక్కరుగా ప్రెస్ మీట్ పెట్టి ఆ వ్యాఖ్యలని ఖండిస్తూ, వర్మని దుమ్మెత్తిపోస్తూ వస్తున్నారు. ముందుగా నాగబాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా, నిన్న అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టారు. ఇక మెగా హీరోలు రాం చరణ్, వరుణ్ తేజ్ లు ట్విట్టర్ లో తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు ఫిలిం ఛాంబర్ లో న్యాయవాదుల మీటింగ్ అల్లు అర్జున్ కూడా రావడం అంటే ఇప్పటిదాకా విభేదాలు ఉన్నాయని భావించిన మెగా ఫ్యామిలీ అంతా ఒక్కతాటిపైకి రావటంతో అభిమానుల నుంచి కూడా మద్ధుతు పెరుగుతుంది.

అయితే ఇక్కడ మరో అంశాన్ని విశ్లేషకులు తెర మీదకి తెస్తున్నారు. అదేమిటంటే జనసేన అధినేతకి మద్దతు పలికేందుకు ఫిల్మ్ ఛాంబర్ కు అల్లు అర్జున్, సీనియర్ నరేష్, మెహెర్ రమేష్, సాయి ధరమ్ తేజ్ తదితరులు చేరుకున్నారు. అయితే సీనియర్ నరేష్ తప్పితే మిగతా వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందినా వారని ఇది బీజేపీ యాక్షన్ ప్లాన్ లో భాగం అని వారు విశ్లేషిస్తున్నారు. వారి వారికి అప్పటికప్పుడు సమాచారం ఇచ్చి అప్పటికప్పుడు ఫిలిం ఛాంబర్ కి పిలిపిస్తే మీడియా ఫోకస్ అంతా అక్కడే ఉంటుందని భావించినట్టు ఇక్కడ స్పష్టమవుతోంది. అయితే ఛాంబర్ లో న్యాయవాదుల తో సమావేసమయిన పవన్ ఇంకా బయటకి రాలేదు పవన్ వస్తే మీడియా దృష్టిని ఆకర్షించేందుకు మరిన్ని సంచలన అంశాలు బయట పెట్టే అవకాసం కనిపిస్తోంది.