ఫిల్మ్‌ ఛాంబర్‌ వద్ద హైడ్రామా

pawan kalyan at film chamber

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

శ్రీరెడ్డితో రామ్‌ గోపాల్‌ వర్మ పవన్‌పై చేయించిన వ్యాఖ్యల దుమారం పెరుగుతోంది. శ్రీరెడ్డి మాట్లాడిన ప్రతి మాట వెనుక తాను ఉన్నాను అని, తాను స్వయంగా చెప్పడం వల్లే ఆమె అలా మాట్లాడటం జరిగిందని వర్మ వీడియోలో చెప్పడంతో మెగా క్యాంప్‌ చాలా సీరియస్‌గా రియాక్ట్‌ అవుతుంది. ఇప్పటికే అల్లు అరవింద్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి రామ్‌ గోపాల్‌ వర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెల్సిందే. తాజాగా నేడు ఉదయం ఫిల్మ్‌ ఛాంబర్‌కు పవన్‌ కళ్యాణ్‌ వెళ్లడం జరిగింది. మొదట పవన్‌ కళ్యాణ్‌ మీడియా సమావేశం నిర్వహించేందుకు ఫిల్మ్‌ ఛాంబర్‌కు వెళ్లాడేమో అని అంతా భావించారు. కాని ఫిల్మ్‌ ఛాంబర్‌ వారు తనకు న్యాయం చేయాలంటూ అక్కడ ఆందోళన చేయడం మొదలు పెట్టాడు.

ఛాంబర్‌ లోనికి వెళ్లిన పవన్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున మెగా కుటుంబ సభ్యులు మరియు సినిమా పరిశ్రమ పెద్దలు అక్కడకు చేరుకుంటున్నారు. ఫిల్మ్‌ ఛాంబర్‌ వద్ద పవన్‌ అంటూ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్స్‌ కూడా పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఫిల్మ్‌ నగర్‌ మొత్తం మెగా అభిమానులతో నిండి పోయింది. పవన్‌ కళ్యాణ్‌ ఏ క్షణంలో అయినా మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. సినిమా పరిశ్రమ నుండి పవన్‌ కళ్యాణ్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమ నుండి రామ్‌ గోపాల్‌ వర్మను బహిష్కరించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా పవన్‌ కళ్యాణ్‌ కోరే అవకాశం ఉంది. ఆ విషయమై సినిమా పరిశ్రమ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. నేడు సాయంత్రం వరకు ఫిల్మ్‌ ఛాంబర్‌ వద్ద ఈ హైడ్రామా కొనసాగే అవకాశం కనిపిస్తుంది.