Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ తల్లిని ఉద్దేశించి సినీ నటి శ్రీరెడ్డి అనకూడని మాట అనటం… అసభ్యకరమైన మాట అనటం ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. పవన్ ని సైద్దాంతికంగా వ్యతిరికేంచే వారు కూడా ఈ విషయంలో పవన్ కి అనుకూలంగా శ్రీ రెడ్డి మీద దుమ్మెత్తి పోశారు. అయితే తర్వాత తప్పు తెలుసుకుని శ్రీ రెడ్డి సారీ కూడా చెప్పింది. తాను అన్న ఆ బూతు మాట తాను అన్నది కాదని… ఎవరో చెప్పిన సలహాతో తాను అన్నానని… క్షమించాలంటూ శ్రీరెడ్డి వేడుకోవడం అంతలోనే… శ్రీరెడ్డిని ఆ మాట అనమని ప్రభావితం చేసింది నేనే తనను క్షమించాలంటూ సారీ చెప్పేశారు దర్శకులు రాంగోపాల్ వర్మ. అయితే ఉదంతం మీద అదే పనిగా పనికిమాలిన చర్చలు పెడుతున్న టీవీ ఛానళ్ల గందరగోళం మరోపక్క ఇన్ని రాద్దాంతాల మధ్య తన తల్లిని దూషించిన ఘటన పై పవన్ కళ్యాణ్ స్పందించారు.
ట్విట్టర్ వేదికగా శ్రీరెడ్డి ఉదంతం, తదనంతర పరిణామాల పై పవన్ కాస్త వేదాంత ధోరణిలో మాట్లాడినట్టు అనిపిస్తోంది. ఎంతో పెద్ద మాట అన్నవాళ్లు సింఫుల్ గా సారీ చెప్పేస్తే సరిపోతుందా ఆ మాట పడిన వాళ్లకు ఒక మనసు ఉంటుందని… వారికి భావోద్వేగాలు ఉంటాయని ఆలోచించరా ? నిన్న రాత్రి ట్వీట్లు చేసిన పవన్… తన తల్లిని అన్న మాటపై ఎంతగా హర్ట్ అయ్యారన్న విషయాన్ని తాజా ట్వీట్స్ ద్వారా చెప్పుకున్నారు. పవన్ ట్వీట్ చదివిన తర్వాత… తన కారణంగా తన తల్లి అంత మాట పడ్డారన్న బాధ కొట్టొచ్చినట్లు కనిపించకమానదు. అందరి మంచి మాత్రమే కోరుకునే తన తల్లిని పట్టుకొని అంత మాట అనటం… దాన్ని అదే పనిగా మీడియాలో చూపిస్తూ… చర్చల మీద చర్చలు జరిపే టీవీ ఛానళ్లపైనా తనకున్నఆక్రోశాన్ని పవన్ తన తాజా ట్వీట్స్లో స్పష్టంగా వెలిబుచ్చారు. నా తల్లి ఆత్మాభిమానాన్ని నేను రక్షించకుంటే బతికుండే కన్నా చావటం మేలన్న వ్యాఖ్యని చూస్తేనే పవన్ ఎంత రగిలిపోయాడో అర్ధం చేసుకోవచ్చు.
అలాగే తన తల్లిని దూషించినందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులైన వారందరి మీద యుద్దం ప్రకటించారు. ఒక కొడుకుగా తాను తన తల్లి గౌరవాన్ని కాపాడలేకపోతే, దానికంటే చావడం మేలన్నారు. తాను సినీ నటుడు, రాజకీయ నాయకుడు కావడానికి ముందు ఒక కొడుకునని ట్వీట్ చేశారు. తాను ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధమని చావుకే భయపడని వాడిని అనే అర్ధం వచ్చేలా ఆయన ట్వీట్ల పరంపర కొనసాగించాడు. అయితే శ్రీ రెడ్డి ఫోన్ సంభాషణలో అంత క్రిస్టల్ క్లియర్ గా వైసీపీ బ్యాచ్ నన్ను కార్నర్ చేయడానికి ప్రయత్నించారు అని శ్రీ రెడ్డి చెప్పినా వైసీపీ ని పల్లెత్తు మాటా అనని పవన్ వైఖరి అనుమానం కలిగిస్తోంది. ఒక తల్లిని తిట్టించడం తప్పే అది ఎవరు చేసినా ఎవరు చేయించినా తప్పే