రాష్ట్ర రాజకీయాలతో చాలా బిజీగా గడుపుతున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చాలా రోజుల సమయం తరువాత మళ్ళీ సినిమాలు చేయడానికి ఒప్పుకొని ఒక అద్భుతమైన చిత్రంలో నటిస్తున్నాడు కూడా… కాగా హిందీలో ఘనవిజయం సాధించిన పింక్ చిత్ర రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయింది కూడా… అయితే రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇలా మళ్ళీ సినిమాలు చేయడం అనేది చాలా మంది తప్పుబడుతున్నారు. కాగా ఇలా విమర్శించేవారందరికి కూడా పవన్ కళ్యాణ్ ఇదివరకే దిమ్మదిరిగే సమాధానం ఇచ్చుకున్నారు.
కాగా తనకు వేరే వ్యాపారాలు లేవని, వందల కోట్ల ఆస్తులు లేవని, ఎక్కువ జీతాలు వచ్చే జాబులు కూడా కావని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే ప్రకటించారు. కాగా ప్రస్తుతానికి తానున్న పరిస్థితుల్లో సినిమాలు చేస్తే తప్ప డబ్బులు రావని, డబ్బులకోసమే చేస్తున్నానని చెప్పారు. ఈనేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం పై జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. “రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చని, తనకు అవసరం అనిపించిన రోజు షూటింగ్ క్యాన్సిల్ చేస్తాననే కండీషన్ ఒప్పుకుంటేనే సినిమాలు చేస్తానని ముందే నిర్మాతలకు పవన్ చెప్పుకున్నారని” నాదెండ్ల తెలిపారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలను, ఇటు సినిమాలను రెండింటిని కూడా బాలన్స్ చేసుకుంటున్నాడు…