తెలుగు విషయంలో టాలీవుడ్ మొత్తంగా వ్యవహరిస్తున్న తీరుపై.. పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్.. తిరుపతిలో.. తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…తెలుగు చిత్ర పరిశ్రమ తీరుపై విమర్శలు గుప్పించారు. తెలుగు సినిమా సాహిత్యం రానురాను దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు హీరోలపైనా పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. తెలుగు హీరోలకు తెలుగు రాయటం, మాట్లాడటం రాదని ప్రకటించారు. అయినా.. తెలుగు సినిమాలతో వచ్చే డబ్బులు హీరోలకు కావాలని మండిపడ్డారు. ఏపీలో తెలుగు మీడియం రద్దుపై తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు.
తెలుగు సినిమాలు తీస్తూ.. ఎవరూ మాట్లాడకపోవడంపై… విభిన్న వర్గాల నుంచి.. విమర్శలు కూడా వచ్చాయి. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు చేసి..లేని పోని చిక్కులు తెచ్చుకోవడం ఎందుకనుకున్నారేమో కానీ ఎవరూ.. నోరు విప్పలేదు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఉండి… రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్.. ఇలాంటి తీరుపై.. విమర్శలు ఎక్కుపెట్టారు. అందులోనూ… తాను హీరో అయి ఉండి..తోటి హీరోలపై గురి పెట్టడమే… చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.హీరోల్లో.. ఎవరెవరికి తెలుగు చదవడం.. రాయడం వచ్చో.. క్లారిటీ లేదు కానీ… స్టార్ హీరోల్లో… మహేష్ బాబు మాత్రం.. నిజాయితీగా.. తన తెలుగు గురించి చెబుతూంటారు. తనకు తెలుగు మాట్లాడటమే..వచ్చని..చదవడం,రాయడం రాదని… చాలా సందర్భాల్లో చెప్పారు.
పవన్ కల్యాణ్ ఏ ఇతర హీరోల గురించి చెప్పారో కానీ…టాలీవుడ్లో కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమావేశంలో పవన్ టాలీవుడ్ పై విమర్శలు మాత్రమే కాదు.. మాతృభాషపై మమకారాన్ని కూడా ప్రదర్శించారు. మాతృభాష మర్చిపోతే ఎన్నో అకృత్యాలు జరుగుతాయన్నారు. సుమతి శతకాలు మనిషిని సరైన దారిలో నడిపిస్తాయని సూచించారు. జగన్‌పై పవన్ పరోక్ష విమర్శలు చేశారు. ఇంగ్లీష్ మాధ్యమం గొప్పది అయితే.. ఇంగ్లీష్‌లో చదివినవారు జైలుకు ఎందుకు పోయినట్టుని సెటైర్ వేశారు. పిల్లలు ఏ భాషలో చదువుకోవాలన్నది తల్లిదండ్రులకు వదిలేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఏపీలో ఉర్ధూ మీడియం స్కూళ్లు నడుస్తున్నాయ…కేవలం తెలుగు స్కూళ్లను మాత్రమే తొలగించి.. ఇంగ్లిష్ మీడియం పెడుతున్నారని మండిపడ్డారు.