Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్ ఎందుకు పవర్ స్టార్ అయ్యాడో పొలిటికల్ స్టార్స్ కి కూడా నేడు అర్ధం అవుతుంది. ఏ రాజకీయ నాయకుడు అయినా కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి చూసి ఆ మంటల్లో చలి కాచుకుంటాడు గానీ ఆ నిప్పుల్లో నీళ్లు చల్లి ప్రశాంతత రావాలని కోరుకోవడం అరుదు. పైగా కుల పరంగా సున్నితమైన ప్రాంతాల్లో ఎక్కడ తమ ఓటు బ్యాంకు కి గండి పడుతుందో అన్న భయంతో ఓ మంచి మాట చెప్పడానికి కూడా వెనకడుగు వేస్తారు. అయితే జనసేన అధినేత పవన్ తన దగ్గర సరికొత్త రాజకీయం చేయగల సత్తా ఉందని నిరూపించుకున్నారు. కులాల కురుక్షేత్రం సాగే విజయవాడ గడ్డ మీద కమ్మ, కాపుల మధ్య గొడవలు మొదలుకుని రంగా హత్య దాకా అన్ని విషయాలను ప్రస్తావించారు. కుల జాడ్యాన్ని వీడకపోతే విజయవాడ అభివృద్ధి ముందుకు పోదని తేల్చి చెప్పారు. కులాల మధ్య ఐక్యత వస్తేనే ఆంధ్రుల రాజధాని అమరావతి ఓ అద్భుతం అవుతుందని పవన్ హితవు చెప్పారు. కులం సహా ఇతర కీలక అంశాలపై పవన్ మాటల్లో హైలైట్స్ మీ కోసం .
-
జనసేనకు యువతే రక్తం…
-
ప్రపంచ రాజధానికి విజయవాడ సిద్ధంగా లేదు
-
మనకు ఉన్న పరిమితులతోనే సాధ్యం…
-
ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళకపోతే ఎంతటి పార్టీ ఆయన ఒడిపోతుంది…
-
కులాలకు మతాలకు అతీతంగా పార్టీలు ఉండాలి…
-
న్యాయం అందరకీ ఒకే విధంగా ఉండాలి…
-
కులాలను విడగొట్టి, పాలించు విధానానికి జనసేన వ్యతిరేకం…
-
10 వేల నుంచి 15 వేల మందితో ఒక వర్క్ షాప్ జనవరిలో పెడతాను…
-
అమరావతి లోనా , లేక హైదరాబాద్ లోనా అనేది తరువాత చెపుతాను..
-
2014 లో ఏ పరిస్థితి లో టీడీపీ కి సపోర్ట్ చేసాను అంటే చంద్రబాబు అనుభవం అవసరమని…
-
సమాజం ముందుకు వెళ్ళాలంటే అంబేద్కర్ ఆశయాలు అవసరం…
-
వంగవీటి రంగాను చపండం తప్పు…
-
ఆయన తప్పు చేసి ఉంటే చట్టాలు ఉన్నాయి…
-
సంబంధంలేని కుటుంబాలు రంగ హత్య సమయంలో ఇబ్బంది పడ్డాయి…
-
విజయవాడలో ఇంకా కులాల వ్యవస్థ నుంచి మారలేదు…
-
విజయవాడ ప్రజలు కులం ఉచ్చు నుంచి ఇంకా బయటకు రాలేదు…
-
టీడీపీకి మద్దతు చాలా ఆలోచించి ఇచ్చాను…
-
రంగా హత్య అనంతరం కమ్మ వారి ఆస్తుల మీద దాడులు జరిగాయి…
-
విభజన తరువాత ఇదే పరిస్థితి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందదు…
-
పరిటాల రవి గుండు కొట్టించాడు అనేది ప్రచారం మాత్రమే…
-
అ ప్రచారం చేయించింది టీడీపీ వాళ్లే…
-
అవన్నీ నేను మనసులో పెట్టుకోలేదు…
-
అన్ని చేసిన టీడీపీకి ఎందుకు మద్దతు ఇచ్చానంటే కులాలు ఐక్యత కోసమే మద్దతు తెలిపాను.
-
కులాల మధ్య ఐక్యత సాధిస్తే అమరావతి అద్భుతమైన రాజధాని అవుతుంది.
-
అభియోగాలు లేకుండా ఉంటే జగన్ కు, ఆయన పార్టీ కి మద్దతు తెలపడానికి ఎటువంటి అభ్యతరాలు లేవు…