Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉపఎన్నికల్లో తటస్థ వైఖరి తీసుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎవరికి వారు పవర్ స్టార్ మద్దతు తమకేనని ప్రకటించుకున్నారు. ముఖ్యంగా టీడీపీ ఓ అడుగు ముందుకేసి 2014లో సపోర్ట్ చేశారు కాబట్టి… 2019 వరకూ తమకే మద్దతిస్తారని చెబుతోంది. మంత్రి అఖిలప్రియ సోదరి మౌనిక అయితే… పవన్ అభిమానులు తమవైపే ఉన్నారని అంటున్నారు.
దీంతో అటు వైసీపీ శిబిరంలో అయోమయం నెలకొంది. పవన్ నిజంగా మద్దతివ్వడం లేదా. లేదంటే స్ట్రాటజీ ప్రకారం అలా చెప్పారా అని వైసీపీ ఆరా తీస్తోంది. తెరవెనుక టీడీపీకి సపోర్ట్ చేస్తూ… ముందు మాత్రం తటస్థ వైఖరి అని చెబుతున్నారేమో అని అనుమానిస్తోంది. పరిస్థితి చూస్తుంటే… పవన్ ఎఫెక్ట్ తోడై టీడీపీకి మెజార్టీ పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇదంతా ముందే ఊహించిన చంద్రబాబు కూల్ గా ఉండగా… జగన్ మాత్రం టెన్షన్ పడుతున్నారట. ఇప్పటికే వైసీపీ ప్రచారంలో చెప్పిన మాటలతో జనంలో వ్యతిరేకత రాగా… ఇప్పుడు పవన్ స్ట్రాటజిక్ సపోర్ట్ తో టీడీపీ చెలరేగుతుందని ఆయన భయపడుతున్నారు. అనవసరంగా నంద్యాల ఎన్నికలు రిఫరెండం అని చెప్పి బుక్కైపోయామని వైసీపీ నేతలు మథనపడుతున్నారు.
మరిన్ని వార్తలు: