సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆయన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ టీజర్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేసింది చిత్ర యూనిట్. తాజాగా కనుమ సందర్భంగా పవన్ కల్యాణ్ మరో సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. పవన్, రానా దగ్గుబాటిలు ఓ మల్టిస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
‘మాళయాళంలో సూపర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని దర్శకుడు సాగర్ కే చంద్ర తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ మూవీ స్ర్కీప్ట్ కూడా పూర్తి కావడంతో ఇక సెట్స్‌పైకి తీసుకేళ్లేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడంట. దీంతో ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లేతో పాటు మాటలు అందిస్తున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇప్పటికే త్రివిక్రమ్, పవన్ ‘తీన్మార్’ చిత్రానికి మాటలు అందించిన విషయం తెలిసిందే. తాజాగా పవన్, రానా మల్టిస్టారర్ సినిమాకు కూడా మాటలతో పాటు స్ర్కీన్ ప్లే అందించనున్నారు. దీనితో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘శాకుంతలం’ అల్లు అరవింద్ తెరకెక్కించనున్న ‘రామాయాణం’ చిత్రాలకు త్రివిక్రమ్ మాటలు రాయడం పూర్తెయింది.
అయితే ఈ మాటల మాంత్రికుడు దర్శకుడిగానే కాకుండా.. మరోసారి మాటల రచయితగా తన కలానికి పని చెబుతున్నాడు. ఇక ‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో ఈ మల్టి స్టారర్ చిత్రానికి పవన్ 40 రోజుల కాల్షీట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మలయాళంలో బ్లక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీలో బిజూ మీనన్, పృథ్వీరాజ్‌లు హీరోలుగా నటించారు. బిజు మీనన్ పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ చేస్తుండగా.. రానా పృథ్వీరాజ్ పాత్రలో కనిపించనున్నాడు.