రేపు మూడు గంటల పాటు పవన్ ఫ్యాన్స్ తో “కత్తి”యుద్ధం.

Pawan kalyan Fans attacks on Kathi Mahesh

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అజ్ఞాతవాసి రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పటికే తొలిరోజు, తొలి షో చూసేందుకు రెడీ అయిపోయారు. ఇక పవన్ అంటే ఇష్టం వున్నా లేకపోయినా ఓ ఫిలిం క్రిటిక్ గా రివ్యూ ఇవ్వడం కోసం అజ్ఞాతవాసి సినిమాని కత్తి మహేష్ కూడా తొలి షో నే చూస్తారు. అంటే దాదాపు మూడు గంటల పాటు పవన్ అభిమానుల మధ్యలో కత్తి మహేష్ ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడున్న వేడి చూస్తే ఆ ఇద్దరు మూడు గంటలు కాదు కదా మూడు క్షణాలు కూడా సంయమనంతో వుండే పరిస్థితి లేదు. ఈ ఇద్దరు ఒక చోట ఉండటమంటే ఎండుగడ్డి పక్కన మంట వెలిగించినట్టే.

సహజంగా కత్తి మహేష్ తొలి షో ప్రసాద్ ఐ మాక్స్ లోనే చూస్తుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అక్కడే సినిమా చూస్తారా లేక ఇంకో థియేటర్ ని ఎంచుకుంటారో. ఏదేమైనా పవన్ ఫ్యాన్స్ తో మూడు గంటల పాటు కత్తి యుద్ధం జరక్కుండా ఉండాలంటే పోలీస్ శాఖ కొన్ని ముందస్తు చర్యలు తీసుకోక తప్పదు. ఒకవేళ ఈ పరిస్థితిని ఊహించి కత్తి మహేష్ ముందుగానే పోలీస్ సాయం కోరితే ఇంకా మంచిది. వేడిలో వున్న పవన్ ఫ్యాన్స్ కి ఇప్పుడు ఎదురుగా కత్తి కనిపించడమంటే మంటల్లో పెట్రోల్ చల్లినట్టే. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఇరు వర్గాలు సంయమనంతో అంత కన్నా తెలివితో వ్యవహరిస్తే మేలు. ఏమంటారు ?