కొట్టుకున్న పవన్ ఫ్యాన్స్… పోలిసుల దగ్గర పంచాయితీ!

Pawan Kalyan Fans Fighting in Tirupati

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

జనసేన పార్టీ అయితే ఏర్పాటు అయి నాలుగేళ్ళు అయ్యింది కానీ, ఇంకా పూర్తి స్థాయి నిర్మాణం జరగలేదు. ఎదో నామమాత్రంగా కమిటీలు వేసి పార్టీని అధినేత పవన్ కల్యాణ్ ఒక్కరే అన్నీ తానే అయి చూసుకుంటున్నారు. ఎన్నికల సమయం ముంచుకొస్తున్నా… జిల్లాల వారిగా, నియోజకవర్గాల వారిగా అధ్యక్షులను కానీ, ఇన్‌చార్జ్‌లను కానీ నియమించలేదు. రెండు మూడు జిల్లాలకి ఒక ఇన్ చార్జ్ లను నియమించి చేతులు దులుపుకున్నారు. అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించిన పవన్… ఇప్పటివరకు ఒక్క అభ్యర్థిని కూడా ఎంపిక చేయలేదు. (దాదాపు తను ఏ నియోజకవర్గంలో పర్యటన చేసినా ఇక్కడి నుండే పోటీ అని చెబుతున్నాడు అది అప్రస్తుతం అనుకోండి) ఫ్యాన్ బేస్‌గా ఏర్పాటయిన జనసేన పార్టీకి అభిమానులే కొండంత బలం. అభిమానులు లేకపోతే పార్టీ జెండా కూడా ఎక్కడా కనిపించదు. అలాంటిది ఇప్పుడు అలంటి అభిమానులు పార్టీ కేడర్ మధ్య విబేధాలు బయటపడ్డాయి.

జనసేనకు చెందిన కిరణ్ రాయల్ తనపై దాడి చేశాడని చిత్తూరు జిల్లా పవన్ అభిమానుల సంఘం అధ్యక్షుడు పసుపులేటి సురేష్ నిన్న తిరుపతి ఈస్ట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. తిరుపతి గురువారెడ్డి సమాధుల వద్ద తనపై నలుగురుతో కలసి కిరణ్ రాయల్ దాడి చేశాడంటూ సురేష్ ఆరోపిస్తున్నాడు. జనసేన పార్టీ‌లో ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి పదవులు లేవని కానీ పార్టీని, పవన్ కల్యాణ్ పేరును అడ్డం పెట్టుకుని కిరణ్ రాయల్ తనపై దాడి చేశాడని పసుపులేటి సురేష్ మీడియాతో పేర్కొన్నాడు.

ఇవన్నీ చూస్తుంటే… జనసేనలో సమన్వయం లోపించిందని, పవన్ కళ్యాణ్ తప్ప మరోనేత ఏ విషయంలోనూ జోక్యం చేసుకునే పరిస్థితి లేదని, ఒక వేళ చేసుకున్నా పవన్ మాట వినే పరిస్థితుల్లో లేరని అర్ధమవుతోంది. పవన్ కాకుండా పార్టీకి – అభిమానులకి మధ్య సమన్వయ కర్తగా వ్యవహరించేవారు ఎవరో ఒకరు లేకపోతే పార్టీకి ముప్పు తప్పదు. అభిమానుల మధ్య ఇలాగే విబేధాలు కొనసాగితే పార్టీకి దెబ్బే. కానీ ఈ విచాదం మీద పవన్ అసలు స్పందిస్తారో లేదో… స్పందిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో ? ఆయన తీసుకునే చర్యల మీద నియమించే వ్యక్తుల మీదనే జనసేన భావితవ్యం ఆధారపది ఉంది.