వినాయక్‌ కూడా సిద్దం చేస్తున్నాడుగా!

Balayya Rejected Inttelligent Director

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బాలకృష్ణ సంక్రాంతికి ‘జైసింహా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఆశించిన రేంజ్‌లో ఆకట్టుకోలేక పోయింది. జైసింహా విడుదలైన వెంటనే తన తండ్రి ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను పట్టాలెక్కించాలని బాలయ్య భావించాడు. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆస్యం అవుతూ వస్తుంది. తేజ ఎన్టీఆర్‌ బయోపిక్‌ నుండి తప్పుకున్న సమయంలో ఇప్పట్లో ఆ బయోపిక్‌ కాదని, కాస్త సమయం పట్టే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అలాంటి సమయంలోనే వినాయక్‌ దర్శకత్వంలో బాలయ్య ఒక చిత్రాన్ని చేస్తాడనే టాక్‌ వినిపించింది. సి కళ్యాణ్‌ తాను బాలయ్య, వినాయక్‌ల మూవీని నిర్మించబోతున్నట్లుగా ప్రకటించాడు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లబోతుందని కూడా సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈలోపుగా ఎన్టీఆర్‌ సినిమాకు క్రిష్‌ వచ్చి చేరాడు. దాంతో వినాయక్‌ సినిమా పక్కకు పోయిందని భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వినాయక్‌, బాలయ్యల మూవీ ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం బాలయ్య కోసం వినాయక్‌ పక్కా మాస్‌ స్క్రిప్ట్‌ను సిద్దం చేయించే పనిలోనే ఉన్నాడు. పలువురు రచయితలతో కలిసి దర్శకుడు వినాయక్‌ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాడు. త్వరలోనే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అవుతుందని, షూటింగ్‌ కార్యక్రమాలకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. తాజాగా నిర్మాత సి కళ్యాణ్‌ తన బ్యానర్‌లో ‘ఏకే47’ అనే టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించాడు. ఆ టైటిల్‌ వినాయక్‌ సూచన మేరకు చేయించాడు అని, బాలయ్యతో వినాయక్‌ చేయబోతున్న సినిమాకు ఈ టైటిల్‌ను అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వినాయక్‌ దర్శకత్వంలో గతంలో బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి చిత్రం చేసిన విషయం తెల్సిందే. ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు వీరి కాంబోలో మూవీ పట్టాలెక్కేందుకు రెడీ అవుతుంది. అయితే ఈ చిత్రం ఎన్టీఆర్‌కు ముందు వస్తుందా లేదా తర్వాత వస్తుందా, లేదంటే రెండు ఒకేసారి తెరకెక్కుతాయా అనేది చర్చనీయాంశంగా ఉంది.