Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజ్ఞాతవాసి చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. సినిమాపై ఉన్న అంచనాలను దర్శకుడు అందుకోలేక పోయాడు. పవన్‌ను ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందు ప్రజెంట్ చేయాలని భావించిన త్రివిక్రమ్ ఆలోచన తారు మారు అయ్యింది. సీరియస్‌గా చేయాల్సిన చిత్రాన్ని కామెడీగా చేశాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. కొందరు ఫ్యాన్స్ త్రివిక్రమ్‌ను తప్పుబడుతుంటే మరి కొందరు మాత్రం సినిమా అన్నాకా ఫ్లాప్, సక్సెస్ అనేది కామన్ అంటూ లైట్ తీసుకుంటున్నారు. సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన తమకు పవన్‌పై అభిమానం మాత్రం తగ్గదు అంటూ పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.
అజ్ఞాతవాసి చూసిన తర్వాత ఒక పవన్ వీరాభిమాని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది… నేను పవన్‌కు వీరాభిమాని. అయినా కూడా అజ్ఞాతవాసి బాగాలేదని చెప్తాను. అభిమానం ఉన్నంత మాత్రాన సినిమా బాగాలేకున్నా ఆహా… ఓహో అనాల్సిన పనిలేదు. సినిమా బాగుంటేనే చూడండి, లేదంటే లేదు అంటూ స్వయంగా పవన్ అంటాడు. అలాంటప్పుడు సినిమా ఫ్లాప్ అనే విషయాన్ని ఒప్పుకోవడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సగటు పవన్ అభిమానిగా సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన బాధపడి పోను. పవన్‌ను నేను కేవలం సినిమాల పరంగా మాత్రమే అభిమానించడం లేదు. ఆయన వ్యక్తిత్వం, ఆయన ఆలోచనలు, ఆయన జీవన శైలి అన్నింటికి నేను అభిమానిని, అందుకే కాటమరాయుడు, అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినంత మాత్రాన నేను పవన్‌ను అభిమానించకుండా ఉండలేను. పవన్ నటించిన సినిమాలు ముందు ముందు ఫ్లాప్ అయినా కూడా ఆయనను అభిమానిస్తూనే ఉంటాను. అయితే పవన్ నటించే ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ ఉంటాను. సూపర్ హిట్ కానంత మాత్రాన కృంగిపోను అంటూ పవన్ అభిమాని పోస్ట్ చేశాడు.