టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి 53 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. అనారోగ్య సమస్యల దృష్ట్యా .. నవంబర్ 24వ తేదీ వరకు ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.. ఇక, చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించడం పై జనసేన అధినేత పవన్ కల్యా ణ్ స్పందించారు.. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యం కలగాలన్న ఆయన.. చంద్రబాబుకు హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం అన్నారు.. సంపూర్ణ ఆరోగ్యంతో.. ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
చంద్రబాబు అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం అని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అందరం ఆయన్ని స్వాగతిద్దాం అంటూ రాసుకొచ్చారు పవన్ కల్యాణ్. కాగా, టీడీపీ అధినేతకు బెయిల్ రావడంతో.. సంబరాల్లో మునిగిపోయాయి టీడీపీ శ్రేణుల.. పలు ప్రాంతాల్లో బాణాసంచా
కాల్చారు.. స్వీట్లు పంచారు టీడీపీ నేతలు.. ఇక, బెయిల్ పత్రాలు అందిన తర్వా త ఈ రోజు సాయంత్రానికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు చంద్రబాబు.. ఆయన నేరుగా హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. హైకోర్టు షరతులకు లోబడి.. ఇంట్లో ఉంటూ.. ఆస్ప త్రికి వెళ్లి చికిత్స తీసుకోనున్నారు చంద్రబాబు నాయుడు.