ఫేక్ ఫాలోవర్స్ లో కూడా ఆయనే టాప్ అట !

Pawan Kalyan gets top place in fake Followers on Twitter

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నేటి సమాజంలో సోషల్ మీడియా కూడా ఒక భాగమైపోయింది. ప్రతి ఒక్కరూ కూడా ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్ లను క్రియేట్ చేసుకొని తమ అభిమాన తారలను ఫాలో అవుతుంటారు. ఇది ఎంతవరకు వెళ్ళింది అంటే ఫేస్ బుక్, ట్విట్టర్ లో అకౌంట్ లేని వారిని వింతగా చూస్తున్నారు అంటే దాని ప్రభావం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. సోషల్ మీడియా ఫాలోయింగ్ విషయంలో అభిమానులు కూడా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనుకుంటూ వాగ్వాదాలకు దిగుతుంటారు. కానీ ఇప్పుడు ఆ నంబర్స్ లో నిజం లేదని తేల్చేసింది ఓ జాతీయ న్యూస్ పేపర్ సర్వే.

ప్రముఖ ఆంగ్ల పత్రిక చేసిన సర్వేలో సెలెబ్రిటీల ట్విట్టర్ ఫాలోవర్స్ లో చాలా మంది ఫేక్ అని వెల్లడించింది. ఆ లిస్టులో ముందుగా స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, ఉండడం షాకిస్తోంది. దాదాపు 54శాతం మంది ఫేక్ ఫాలోవర్స్ పవన్ కు ఉన్నారట… అయితే ఇప్పుడు ‘ట్విట్టర్-ఆడిట్’ అనే సంస్థ జాతీయ స్థాయిలో నాయకుల ట్విట్టర్ అకౌంట్స్… ఆ నాయకులకు ఉన్న ఫాలోవర్స్ సంఖ్య… అందులో ఫేక్ అకౌంట్స్ తో ఫాల్స్ పబ్లిసిటీ చేసుకుంటున్న నాయకుల లిస్ట్ తీసింది… అంటే దాదాపుగా 54శాతం ఫేక్ ఫాలోవర్స్ అన్నమాట.

ఇక సమంతకు 6.78 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా అందులో ఫేక్ ఐడీలతో ఫాలో అవుతున్న వాళ్ళే 32 శాతం కనిపిస్తున్నారట. మహేష్ బాబుకి ఉన్న 6.47 మిలియన్ ఫాలోవర్స్ లో 31 శాతం ఫేక్ అని తేలింది. వీళ్ళు మాత్రమే కాదు రాజమౌళి, ఎన్టీఆర్ ఇలా చాలా మంది సినీ సెలబ్రిటీలలో సగానికి పైనే ఫేక్ ఫాలోవర్స్ ఉన్నారని తేల్చిచెబుతున్నారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ తారలు కూడా ఈ ఫేక్ ఫాలోవర్స్ లిస్టులో పోటీ పడుతున్నారని సమాచారం.