భావోద్వేగానికి గురైన పవన్ కల్యాణ్

భావోద్వేగానికి గురైన పవన్ కల్యాణ్

వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు జనసేన నిద్రపోదని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా.. పోలీసుల చేతిలో గురైన రైతులు.. పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా పవన్ భావోద్వేగానికి గురయ్యారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచుతామంటేనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అమరావతికి ప్రధాని శంకుస్థాపన చేశారు కాబట్టి మేం గౌరవిస్తాం..

అమరావతిలోనే రాజధానిని ఉంచుతామని బీజేపీ నేతలు హామీ ఇచ్చారని పవన్ ప్రకటించా ఢిల్లీలో రాష్ట్ర పరిస్థితిని తెలియజేస్తా … వైసీపీ ప్రభుత్వం లేకుండా చేసేందుకు ఏం చేయాలో చేస్తానని ప్రకటించారు. ఇది మా రాజధాని అనిపించేలా జనసేన, బీజేపీ పనిచేస్తాయని.. 151 మంది ఎమ్మెల్యేలు ఎన్ని తిట్టినా భరిస్తానన్నారు. వైసీపీ నేతల నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను కక్కేలా చేస్తానని హెచ్చరించారు. రైతులు, మహిళలపై లాఠీఛార్జ్‌ కంటతడి పెట్టిస్తోందన్నారు.

వైసీపీ ఆలోచనా విధానాన్నే పోలీసులు అవలంభిస్తున్నారని … ఆడపడుచులు రోడ్డుపైకి వచ్చి పోరాడుతుంటే పాశవికంగా దాడి చేశారని… ఆడపడుచులపై పోలీసుల దాడిని మర్చిపోనని శపథంచేశారు.దివ్యాంగులన్న కనికరం కూడా లేకుండా లాఠీచార్జ్‌ చేశారు ఒళ్లంతా మదమెక్కితేనే ఇలాంటి పనులు చేస్తారని మండిపడ్డారు. వైసీపీ వ్యక్తిత్వం రౌడీ సంస్కృతి, ఫ్యాక్షనిస్టు సంస్కృతి అని..వారు అధికారంలోకి వస్తే.. ప్రజలపై చూపుతారని మొదటి నుంచీ చెబుతున్నానన్నారు.

రాజధానిపై సమష్టిగా నిర్ణయం తీసుకున్నప్పుడు.. తర్వాత ప్రభుత్వం పాటించి తీరాలన్నారు. ఒక సామాజికవర్గం అని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్న నెపంతో.. ఇన్ని కులాలను, ఇంత మందిని క్షోభపెట్టారని .. వైసీపీ వినాశనం మొదలైంది..భవిష్యత్‌లో వైసీపీ ఉండకూడదని శాపం పెట్టారు. 3పంటలు పండే పొలాలను రాజధాని కోసం త్యాగం చేశారని .. రాజధాని కదలదు..గుర్తుపెట్టుకోండి.. అని హామీ ఇచ్చారు.

వైసీపీ నేతల భూములు అమరావతిలో ఉండి ఉంటే.. రాజధానిని కదిలించే వాళ్లు కాదని… వాళ్ల భూములన్నీ విశాఖలోనే ఉన్నాయి..అందుకే ఉత్తరాంధ్ర మీద ప్రేమ చూపుతున్నారన్నారు. ఇవాళ అమరావతిని మోసం చేసిన వాళ్లు.. రేపు కడప, విశాఖ..అందర్నీ మోసం చేస్తారని .. మహిళలపై దాడులను సెక్రటేరియెట్‌ ఉద్యోగులు గమనించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు.. రాజకీయ నాయకుల్ని నమ్మొద్దని సూచించారు. బుధవారం పవన్ కల్యామ్ ఢిల్లీకి వెళ్తున్నారు. బుధవారం సాయంత్రం బీజేపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. అందులో..రాజధానిపై పోరాట కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.