టీడీపీ నేతల ఫై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం

టీడీపీ నేతల ఫై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం

మూడో రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న టీడీపీ నేతల ఫై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతు భరోసా, కేంద్రాల ఫై జరుగుతున్న చర్చలకు అంతరాయం కలిగేలా టీడీపీ నేతలు వ్యవహరించారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేయడం తో సభలో గందరగోళం నెలకొంది. అయితే టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఫై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.

అయితే ప్రజాస్వామ్యాన్ని టీడీపీ అపహాస్యం చేస్తుందని జగన్ అన్నారు. మా 151 మంది ఎమ్మెల్యేలు ఓపిగ్గా ఉంటే, టీడీపీ ఎమ్మెల్యే లు పోడియం మీదికు వస్తున్నారు. స్పీకర్ చుట్టూ గుమిగూడి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు సంస్కారం లేని వ్యక్తులు, ప్రజా సమస్యలని చర్చించడం వారికి ఇష్టం లేదని జగన్ అన్నారు. వీరు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో తెలీదు, సలహాలు ఇవ్వకుండా సమస్యలు సృష్టిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని, మార్షల్స్,రింగ్ దాటి వస్తే ఆందోళన చేసే వారిని అక్కడినుండి అటువైపే బయటికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాల్సిందే అని జగన్ అన్నారు.