విజ‌య‌శాంతి ష‌ర‌తులు వింటే మైండ్ బ్లాంక్

విజ‌య‌శాంతి ష‌ర‌తులు వింటే మైండ్ బ్లాంక్

స‌రిలేరు నీకెవ్వ‌రు తో 13 ఏళ్ల త‌ర‌వాత రీ ఎంట్రీ ఇచ్చింది విజ‌య‌శాంతి. ఆ సినిమాకు త‌ను ప్ల‌స్ అయ్యింది. త‌న‌కు ఆ సినిమా ప్ల‌స్ అయ్యింది. ఈ సినిమాకి గానూ విజ‌య‌శాంతికి రూ.3 కోట్ల వ‌ర‌కూ ముట్టిన‌ట్టు స‌మాచారం. అడిగినంత పారితోషికం ఇవ్వ‌డానికి ఇప్ప‌టికీ నిర్మాత‌లు రెడీగానే ఉన్నారు. కాక‌పోతే… విజ‌య‌శాంతి ష‌ర‌తులు వింటేనే మైండ్ బ్లాంక్ అయిపోతోంద‌ట‌. మ‌హేష్‌బాబులాంటి స్టార్ సినిమాల్లోనే చేస్తాన‌న్న‌ది విజ‌య‌శాంతి మొట్ట‌మొద‌టి ష‌ర‌తు. యంగ్ హీరోలు, చిన్నా చిత‌కా సినిమాలైతే అస‌లు క‌థే విన‌న‌ని చెబుతోంద‌ట‌. అంతే కాదు.. ఏ హీరోతో సినిమా చేస్తే, ఆ హీరోకి ఇచ్చే కంఫ‌ర్ట్స్ త‌న‌కూ కావాలి అంటోంద‌ట‌. ప్ర‌చారంలో త‌ను కూడా ప్ర‌ముఖంగా క‌నిపించాల‌ని, ముఖ్యంగా పోస్ట‌ర్ల‌లో హీరోతో పాటు స‌మాన‌మైన ప్రాధాన్యం ఇవ్వాల‌ని అంటోంద‌ట‌. త‌న పాత్ర నిడివి ముందు ఎంత చెబితే అంతే ఉండాల‌ని, తీసిన సన్నివేశాలు ఒక్క‌టీ తొల‌గించ‌కూడ‌ద‌ని చెబుతోంద‌ట‌. ఈ ష‌ర‌తుల‌న్నింటికీ ఒప్పుకుంటే… అప్పుడు క‌థ వింటుంద‌ట‌. విజ‌య‌శాంతి అడిగే పారితోషికం కంటే, ఈ ష‌ర‌తులే క‌ఠినంగా ఉన్నాయ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.