కొత్త చిత్రానికి షూటింగ్ ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్

కొత్త చిత్రానికి షూటింగ్ ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్

ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాలతో చాలా బిజీగా గడుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇటీవలే తన కొత్త చిత్రానికి సంబందించిన షూటింగ్ ని ప్రారంభించారు. బాలీవుడ్ లో మంచి విజయాన్ని నమోదు చేసుకున్న పింక్ చిత్రాన్ని తెలుగులో, ఇక్కడి నేటివిటీకి అనుగుణంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. కాగా అతి కొద్దీ రోజుల్లోనే ఈ చిత్రీకరణ పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకరాడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి సంబందించిన మరొక వార్త సామాజిక మాంద్యమాల్లో బాగా వైరల్ గా మారుతుంది…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొందర్లోనే తన మరొక చిత్రాన్ని పట్టాల మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ – క్రిష్ ల కలయికలో ఈ చిత్రం రానుందని సమాచారం… అయితే ఇందులో పవన్ కళ్యాణ్ ఒక దొంగ గా కనిపిస్తాడని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని ఈ నెల 27 నుండి హైదరాబాద్‌ లో ఎలాంటి హంగమా లేకుండా షూటింగ్ ప్రారంభించనున్నారని సమాచారం. కానీ దీనికి సంబందించిన వార్త అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది.