మూడు రాజధానులను నిర్మించాలని నిర్ణయించుకున్న వైసీపీ

మూడు రాజధానులను నిర్మించాలని నిర్ణయించుకున్న వైసీపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాగైనా సరే మూడు రాజధానులను నిర్మించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకున్న సంగతి చక్కగా అర్థమవుతుంది…. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి మూడు రాజధానులను నిర్మించాలని ఏర్పాటు చేసిన బిల్లును అమలు చేయడానికి వైసీపీ ప్రభుత్వం ప్రణాళికలు రుదిద్దుతున్న తరుణంలో రాజధాని అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు తమ ఉద్యమాన్ని ఉదృతం చేస్తున్నారు. రాష్ట్ర రాజధానిని అమరావతి నుండి మార్చేది లేదని, ఈ విషయంలో తాము వెనకడుగు వేసేది లేదని, తమ పోరాటాన్ని కూడా ఆపేది లేదని రైతులందరూ కూడా హెచ్చరికలతో కూడిన ప్రకటనలు చేస్తున్నారు.

ఈ తరుణంలో రాష్ట్ర ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు, జేఏసీ నేతృత్వంలోని పార్టీలు రాష్ట్ర వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని దారుణంగా విమర్శిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ, తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా ఒక పోస్టు పెట్టారు. “తిరుగుబాటు మొదలైంది.. ఇక సమరమే అంటూ ఓ వ్యాఖ్యను పోస్ట్ చేశారు. అంతకుముందు శాంతి యుతంగా నిరసనలు తెలుపుతున్న తమ పార్టీ నేతలను అరెస్టు చేస్తారా” అంటూ ప్రశ్నించారు.