తెలుగులో రీమేక్ అవుతున్న అసురన్

తెలుగులో రీమేక్ అవుతున్న అసురన్

కోలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ మూవీ అసురన్ ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరో గా నటించనున్న ఈ చిత్రాన్ని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్నాడు. రేపటి నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఇప్పటివరకు కుటుంభ కథా చిత్రాలను తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల మొదటి సారి పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ ను డైరెక్ట్ చేస్తుండడం తో ఈ రీమేక్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రముఖ తమిళ నిర్మాత కలై పులి ఎస్ తాను తో కలిసి సురేష్ బాబు నిర్మించనున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నాడు. ఈచిత్రంలో వెంకీకి జోడిగా ప్రియమణి నటించనుంది.

ఇక ఈ చిత్రానికి టైటిల్ కూడా ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రివేంజ్ డ్రామాగా రానున్న ఈ చిత్రానికి నారప్ప అనే టైటిల్ ను పెట్టనున్నారట. త్వరలోనే ఈ టైటిల్ విషయంలో క్లారిటీ రానుంది. ఈ ఏడాది మే లో ఈ చిత్రాన్ని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఒరిజినల్ వెర్షన్ లో ధనుష్ , మలయాళ నటి మంజూ వారియర్ లీడ్ రోల్స్ లో నటించగా వెట్రి మారన్ డైరెక్ట్ చేశాడు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం 100 కోట్ల వసూళ్ల ను రాబట్టింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం వెంకీ వరస విజయాల తో ఫుల్ ఫామ్ లో వున్నాడు. అందులో భాగంగా గత ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 తో వచ్చి చాలా కాలం తరువాత బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఈ సీనియర్ హీరో అదే ఏడాది చివర్లో వెంకీ మామ తోవచ్చి సూపర్ హిట్ కొట్టాడు. మరి అసురన్ రీమేక్ తో వెంకీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.