ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని ప్రజలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని ప్రజలు

రాష్ట్ర రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ప్రజలు, రైతులందరూ కూడా ఆందోళనలు చేపడుతున్నారు. అయితే రాజధాని ప్రాంతాల రైతులందరికీ కూడా సంఘీభావం తెలిపేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత రాత్రి ప్రయత్నించగా, పోలీసులు కావాలనే అభ్యంతరం వ్యక్తం చేసి, అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి మరియు, పోలీసులందరికి కూడా మాటల యుద్ధం జరిగిందని చెప్పాలి… అయితే ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ స్పందిస్తూ, ప్రభుత్వ విధానాలపై సంచలనమైన వాఖ్యలు చేశారు.

కాగా బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తమ భాగస్వామ్య నేత పవన్ కళ్యాణ్ కి సంఘీభావం ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నేతలందరూ కూడా ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ, నేతలను మాట్లాడకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇకపోతే… పాలన విధానంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గత ముఖ్యమంత్రి చంద్రబాబు ని మించిపోయారని ఆరోపించారు.