పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న సమంత, శర్వానంద్‌లు

పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న సమంత, శర్వానంద్‌లు

కోలీవుడ్‌లో సూపర్‌ హిట్ అయిన 96 సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్‌లో త్రిష, విజయ్‌ సేతుపతిలు అద్భుతమైన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న పాత్రల్లో తెలుగులో సమంత, శర్వానంద్‌లు కనిపించనున్నారు. పెళ్లి తరువాత ఎక్కువగా పర్ఫామెన్స్‌కు స్కోప్‌ ఉన్న పాత్రలు మాత్రమే చేస్తున్న సమంత ఈ సినిమాతో మరోసారి తన స్టామినాను ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతోంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఒరిజినల్‌ వర్షన్‌ను డైరెక్ట్‌ చేసిన సీ ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. వరుసగా టీజర్‌, లిరికల్‌ వీడియోలతో సందడి చేస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు.

రామ్‌, జాను పాత్రల్లో సమంత, శర్వాలు సూపర్బ్ అనిపించేలా ఉన్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 7న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అధికారిక ప్రకటన రాకపోయినా దాదాపు ఇదే డేట్‌ను ఫిక్స్‌ చేసే ఛాన్స్‌ ఉందని తెలుస్తోంది. రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు గోవింద వసంత సంగీతమందిస్తున్నాడు.

ముందుగా ఈ సినిమాను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తారన్న టాక్‌ వినిపించింది. కానీ అదే రోజు విజయ్‌ దేవరకొండ, క్రాంతి మాధవ్‌ కాంబినేషన్‌లో రూపొందిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ రిలీజ్‌ అవుతుండటంతో జాను టీం కాస్త ముందుగానే థియేటర్లలోకి వచ్చేందుక నిర్ణయించుకున్నారు. త్వరలోనే రిలీజ్‌ డేట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది.