అమలాపాల్ ఇంట్లో విషాదం

అమలాపాల్ ఇంట్లో విషాదం

స్టార్ హీరోయిన్ అమలాపాల్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి వర్గీస్ పాల్ హఠాన్మరణంతో సినీ వర్గాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వర్గీస్ పాల్ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు.61 ఏళ్ల వయుసున్న ఆయన కొచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తండ్రి వర్గీస్ పాల్ మరణవార్త తెలుసుకున్న అమలాపాల్ కన్నీటి పర్యంతమైంది. ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న ఆమె హుటాహుటిన చెన్నై నుంచి కేరళ బయల్దేరి వెళ్ళింది.అమలా పాల్ తండ్రి మరణ వార్తతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సాయంత్రం కురుప్పంపాడులో పాల్ వర్గీస్ అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.