సొంత ఆలోచనలతో కెరీర్‌ను తీర్చిదిద్దుకున్న పవన్ కల్యాణ్

సొంత ఆలోచనలతో కెరీర్‌ను తీర్చిదిద్దుకున్న పవన్ కల్యాణ్

సినిమాల్లో అయినా…. రాజకీయాల్లో అయినా.. అన్నింటికీ సమాధానం సక్సెస్సే. ఎన్ని పరాజయాలు ఎదుర్కొన్నప్పటికీ.. ఒక్క సక్సెస్ చూస్తే… అప్పటి వరకూ…దూరం పెట్టిన వాళ్లంతా..దగ్గరకు వస్తారు. అప్పటి వరకూ విమర్శించిన వారంతా… పొగడ్తలు కురిపిస్తారు. విజయానికి ఉన్న పవర్ అది. పవన్ కల్యాణ్… రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఉద్దేశం ఉన్న పళంగా అధికారం చేపట్టడం కాదు. పాతికేళ్ల రాజకీయం చేస్తానని.. చాలా ధీమాగా చెబుతున్నారు. ఇలా ఓ ఎన్నికలో ఓడిపోయి ఉండవచ్చు. కానీ.. ఆయన పొలిటికల్ కెరీర్ మాత్రం అయిపోలేదు. సినిమా రంగంలోనూ పవర్ స్టార్ ఇలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొన్నారు.

పవన్ కల్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి.. అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత.. ఆయనను ఇండస్ట్రీలో పలకరిచేవారే లేరు. తర్వాత తన సొంత ఆలోచనలతో తన కెరీర్‌ను తీర్చిదిద్దుకున్నారు. ఇప్పుుడ ఈ స్థితికి ఎదిగారు. ఆ విషయంలో పవన్ కల్యాణ్ స్టామినాను ఎవరూ తక్కువ అంచనా వేయడం లేదు. ఇప్పుడు రాజకీయాల్లోనూ అలాగే అవుతుందని.. ఆయన సన్నిహితులు అంటున్నారు. పవర్ స్టార్‌ని కాదని…రాజకీయాల్లో తాను..జనసేన అధినేత ను మాత్రమేనని పవన్ కల్యాణ్..పార్టీ కార్యకర్తలకు చెబుతూ ఉంటారు. దానికి తగ్గట్లుగానే ఆయన వ్యవహరిస్తూంటారు.

కానీ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం.. ఆయనను సినిమా హీరోగా గుర్తించి… పార్ట్ టైమ్ రాజకీయ నాయకుడిగా వ్యాఖ్యానిస్తూ విమర్శలు చేస్తూంటారు. ఇదంతా రాజకీయాల్లో భాగం. వారు విమర్శించారని.. పవన్ కల్యాణ్ వెనుకడుగు వేస్తే.. వారిదే పైచేయి అవుతుంది. అలా చేస్తే.. రాజకీయంగానే కాదు.. సినీ కెరీర్ పరంగా కూడా పతనం ప్రారంభమవుతుంది. ఈ విషయం పవన్ కల్యాణ్ కు కూడా బాగా తెలుసు. అందుకే.. వ్యక్తిగతంగా విరుచుకుపడుతున్నప్పటికీ.. సినిమాల్లో నటించాలన్న తన నిర్ణయాన్ని తప్పు పడుతున్నప్పటికీ వెనక్కి తగ్గడం లేదు. సినిమాల్లో సాధించే ఒక్క సక్సెస్.. రాజకీయ విజయానికి కూడా బాటలు వేస్తుందని..గతంలో ఎన్నో సార్లు నిరూపితమయిది. అలాంటి విజయం ఒక్కటి వచ్చిన రోజున..పవన్ కల్యాణ్ పై ఇప్పుడు విమర్శలు చేస్తున్నవారే.. వచ్చి పక్కన నిలబడతారు.