Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అస్సలు రోజులు కలసి రావడం లేదు. ఒకపక్క తాను నటించిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తుంటే మరో పక్క తాను రాజకీయంగా చేసిన ఆరోపణలు ఇప్పుడు తన నెట్టి మీదకి కొత్త కేసులు తెచ్చి పెడుతున్నాయి. ఇప్పటికే దేవ్ అలియాస్ వాసుదేవ్ అనబడే బీజేపీ ద్వీతీయశ్రేణి నాయకుడ్ని… తన పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఎంపిక చేసుకోవడంతో వచ్చి పడుతున్న విమర్శలను తిప్పికొట్టలేక పవన్ మొహం చాటేశాడు. తన మీద వచ్చిన అన్ని ఆరోపణల మీదా స్పందించిన పవన్ ఈ విషయంలో మౌనంగా ఉండటం గమనార్హం.
దీనికి తోడు ఇప్పుడు కొత్తగా పవన్ కల్యాణ్‌కు కేసుల బెడద పట్టుకుంది. శ్రీరెడ్డి అనే నటీ తనను తిట్టిందని అది పరోక్షంగా తన తల్లిని తిట్టినట్టని, కానీ టీఆర్పీలకోసం గడ్డి తినే చానెళ్ళు ఆ తిట్టును పదే పదే ప్రసారం చేస్తున్నాయని… పవన్ కల్యాణ్… మీడియా పై చిన్న సైజ్ పోరాటం ట్విట్టర్ వేదికగా చేశారు. తెలుగుదేశం పార్టీ నేత లోకేషే ఇదంతా చేయిస్తున్నాడంటూ… ట్వీట్లు చేసి… ఓ రోజు ఫిల్మ్ చాంబర్లో లాయర్లతో మీటింగ్ పెట్టి హైడ్రామా కూడా నడపించారు. అదే రోజు… ఓ మీడియా చానల్‌పై దాడి జరిగింది. ఆ వేడిలోనే… పవన్ కల్యాణ్ ఓ వీడియో తన ట్విట్టర్ ఎకౌంట్ నుంచి అప్ లోడ్ చేశారు.
టీవీ నైన్ తన తల్లిని ఇలానే తిట్టిందటూ చెప్పుకొచ్చారు. నిజానికి ఆ వీడియో టీవీనైన్లో ప్రసారం చేయలేదు. అందులో శ్రీరెడ్డి అనే నటీమణి పవన్ ను తిట్టినట్లు చెబుతున్న తిట్టును. కానీ పవన్ ట్వీట్ చేసిన వీడియోలో మాత్రం ఆ తిట్టు స్పష్టంగా ఉంది. కేవలం అభిమానుల్ని రెచ్చగొట్టి… దాడులు చేయించడానికే పవన్ ఇలా మార్ఫింగ్ వీడియోను అప్ లోడ్ చేశారని… టీవీ నైన్ యాజమాన్యం, జర్నలిస్టు సంఘాల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక సాక్ష్యాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కల్యాణ్ మార్ఫింగ్ వీడియోను అప్ లోడ్ చేసినట్లు తేలిపోయింది. పవన్ మీద ఇంతకు ముందే మూడు సెక్షన్లలో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ ట్విట్టర్ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఆ ల్యాబ్ నుంచి తాజాగా బంజారాహిల్స్ పోలీసులు ఓ రిపోర్ట్ అందింది. దాని ప్రకారం… ఆ వీడియోను మార్ఫింగ్ చేసినది వంద శాతం నిజమని తేల్చారు. అంటే… అప్ లోడ్ అయినది… పవన్ ట్విట్టర్ అకౌంట్ నుంచి అని గతంలోనే ఆధారాలు సేకరించారు.
ఇప్పుడు మార్ఫింగ్ అయినట్లు ఫోరెన్సిక్ తేల్చింది. మార్ఫింగ్‌ను పవన్ చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయినా అది పవన్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ నుంచి… దాన్ని అప్ లోడ్ చేసినందున… కచ్చితంగా నేరం పవన్ మీదకే వస్తుందని… న్యాయనిపుణులు అంచనా. ప్రస్తుతం కేసు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే… పవన్ కల్యాణ్‌ను అరెస్ట్ చేసి… వెంటనే బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఎప్పుడైనా… పవన్ ను అరెస్ట్ చేయవచ్చని ప్రచారం సాగుతోంది. పవన్ మీద మోపిన అభియోగాల ప్రకారం అయితే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష పడుతుంది. దీనికి జరిమానా అదనం. దీంతో ఎప్పుడు ఏమి జరగనుందో అన్న టెన్షన్ జనసేన వర్గాల్లో నెలకొంది.