జాతీయ రాజకీయాల గురించి చర్చలు జరిపేందుకు బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసేందుకు తాను యూపీ రాజధాని లక్నోకు వెళుతున్నట్లుగా పవన్ కాసింత హడావుడి చేయటం తెలిసిందే. పవన్ తో పాటు ఈ మధ్యన ఆయన పార్టీలో చేరి అప్పటి నుండి ఆయన్ని అంటిపెట్టుకునే తిరుగుతున్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో పాటు మరికొందరు నేతల పరివారం లక్నో టూర్ కు వెళ్లారు. అయితే ఇంత హడావుడి చేసి లక్నోకు వెళ్లిన పవన్ మాయావతిని కలవలేదు. ఎందుకంటే ఆమె నుంచి ముందస్తు అపాయింట్ మెంట్ తీసుకోకపోవటం కారణంగా ఆమె కలవడానికి సుముఖత చూపలేదని చెబుతున్నారు. అయినా పవన్ లాంటోడు ఒక జాతీయ స్థాయి నాయకురాలిని కలిసేందుకు వెళ్లేటప్పుడు అపాయింట్ మెంట్ తీసుకోకుండా వెళతారా? అనే సందేహం పుట్టగా లోతుగా తెలుసుకున్న నిజాలు ఇప్పుడు బైర్లు కమ్మిస్తున్నాయి.
లక్నోపర్యటనకు వెళ్లిన పవన్ కల్యాణ్ అక్కడ అందరూ చెప్పుకుంటున్నట్లుగా మాయావతిని కలవలేదు. కాకపోతే అంబేదర్క్ పార్క్ లో కాసేపు పిల్లగాలి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారు..?. రెండు గంటలు ఎవరికీ చెప్పకుండా సెక్యూరిటీ లేకుండా ఈ రెండు గంటలు ఎక్కడికి వెళ్లారు? ఇప్పటి వరకూ ఇదో సందేహం. కానీ ఇప్పుడే అసలు విషయం బయటకు వచ్చింది. ఆ రోజున బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా లక్నోలోనే ఉన్నారు. పార్టీ అంతర్గత సమావేశం కోసం లక్నోలో అమిత్ షా ఉండటంతో ఆయన అపాయింట్ మెంట్ అక్కడ దొరకడంతోనే పవన్ కల్యాణ్.. లక్నో వెళ్లారు. వాస్తవానికి వెళ్లింది మాయావతితో భేటీ కోసం కాదు. ముందస్తుగా అపాయింట్ మెంట్ ఇచ్చి ఉంటే మాయావతిని కలిసేవారు.
కానీ అక్కడ జరిగింది అమిత్ షా తో భేటీ. ఆంధ్రప్రదేశ్ లో ఏం చేయాలన్నదానిపై వారు చర్చించినట్లు సమాచారం. డిల్లి లోనో లేదా హైదరాబాద్ లోనో కలిస్తే ప్రజలకు అనుమానాలు వస్తాయని ఆదే లక్నో లో అయితే ప్రజల దృష్టి ఏమార్చవచ్చు అనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. అందుకే పవన్ లక్నోలో అమిత్ షా ని కలిసి భవిష్యత్తు లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. తనతో పాటే లక్నో వచ్చిన నాదెండ్ల మనోహర్ ని కూడా ఈ సమావేశానికి తీసుకెళ్ళలేదని సమాచారం. నాదెండ్ల మనోహర్ ని కూడా మాయవతిని కలవటానికే లక్నో వెళ్ళాం అనే ఆలోచనలోనే ఉంచి, మధ్యలో రెండు గంటలు పాటు వ్యక్తిగత పనుల పేరుతో మాయం అయ్యి, అమిత్ షా దగ్గర ప్రత్యక్షం అయ్యి ప్రణాళికలు రచించినట్లు తెలుస్తుంది.
వారి ప్రణాలికల ప్రకారమే బీజేపీ నేతలు ఇప్పుడు విచిత్రమైన వాదన తెరపైకి తెచ్చారు. రేపు పవన్ కల్యాణ్ పై దాడి జరిగినా అభిమానులే చేశారంటారా అని విష్ణు వర్ధన్ రెడ్డి వాదన తెరపైకి తీసుక వచ్చారు. అంటే.. ఏదో ప్లాన్ ఉందన్న సంగతి ఈజీగా అర్థమైపోతుంది. దీంతో ఆపరేషన్ గరుడ గురించి శివాజీ చెప్పినట్టు ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే భయంలో ఉన్నారు ఏపీ ప్రజలు.