Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉన్నట్టుండి తెలంగాణ నుంచి రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు మూడు జిల్లాల గుండా పవన్ రాజకీయ యాత్ర సాగుంతుంది. ఈ యాత్ర ప్రజా సమస్యల మీద అధ్యయనం కోసం ఉపయోగపడుతుందని పవన్ చెప్పుకొచ్చారు. ఈ నాలుగు రోజుల యాత్ర తరువాత ఇంకో దఫా తెలంగాణ లో పార్టీ శ్రేణులతో సమావేశం అయి తదుపరి యాత్ర షెడ్యూల్ ఖరారు చేస్తానని పవన్ వెల్లడించారు.
ముందుగా అనుకున్నట్టు ఈ పాదయాత్ర కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి సాగుతుంది. అయితే తదుపరి యాత్ర మాత్రం పూర్తిగా పాదయాత్ర లేదా కారులో రోడ్ షో , లేదా బస్సు యాత్రా అనే దానిపై పవన్ క్లారిటీ ఇవ్వలేదు. ముందు ఓ పద్ధతిలో ఈ యాత్ర ఉంటుందని చెప్పకుండా అప్పటికి వున్న పరిస్థితిని బట్టి పాదయాత్ర లేదా బస్సు యాత్ర లేదా కారులో రోడ్ షో …ఇలా ఏదో ఒక పద్ధతిలో లేదా అన్ని పద్ధతులు కలుపుకుంటూ పవన్ రాజకీయ యాత్ర సాగే ఛాన్స్ వుంది.