Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘జైలవకుశ’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటించబోతున్న చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా, రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు అనే విషయం అందరికి తెల్సిందే. అయితే విశ్వసనీయంగా అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం ఎన్టీఆర్ చిత్ర నిర్మాణంలో పవన్ కళ్యాణ్ కూడా భాగస్వామిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. జనసేన పార్టీ నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్‌కు పెద్ద మొత్తంలో ఆర్థిక నిధులు అవసరం ఉంది. అందుకే వరుసగా చిత్రాలు చేయడంతో పాటు, పలు సినిమాల నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నాడు. ఇప్పటికే నితిన్‌తో సినిమాను నిర్మిస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమాకు కూడా నిర్మాతగా భాగస్వామి అయినట్లుగా తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్‌కు ఉన్న బ్రాండ్ పెట్టుబడిగా రాధాకృష్ణ భావించి తన సినిమాలో 25 శాతం వాటాను ఎలాంటి డబ్బులు పెట్టకుండానే ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్ర నిర్మాణంలో కూడా పవన్ భాగస్వామిగా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. పవన్ 25వ చిత్రం అయిన అజ్ఞాతవాసికి పారితోషికం తీసుకోకుండా వచ్చిన ప్రాఫిట్లో 50 శాతం తీసుకోవాలని నిర్ణయించాడు. అందుకు నిర్మాత రాధాకృష్ణ కూడా ఓకే చెప్పాడు. అదే జరిగితే పవన్‌కు ఈ చిత్రం ద్వారా కనీసం 30 నుండి 40 కోట్ల మేరకు లాభం రావడం ఖాయం అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక ఎన్టీఆర్ సినిమా నిర్మాణ భాగస్వామ్యంతో 10 నుండి 15 కోట్ల మేరకు పవన్‌కు ప్రాఫిట్ వస్తుందని సినీ పరిశ్రమ వారు లెక్కలు చెబుతున్నారు. మొత్తానికి పవన్ భారీ ఎత్తున నిధులు సేకరిస్తూ జనసేన పార్టీ కోసం ఖర్చు చేయాలని నిర్ణయించాడు.