జగన్ మోహన్ రెడ్డి ఫై పవన్ కళ్యాణ్ వరుస ప్రశ్నలు

జగన్ మోహన్ రెడ్డి ఫై పవన్ కళ్యాణ్ వరుస ప్రశ్నలు

పవన్ కళ్యాణ్ మరొకసారి జగన్ మోహన్ రెడ్డి ఫై వరుస ప్రశ్నలు గుప్పించారు. ఏవైతే హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలుపొందారో వాటి విషయాలలో జగన్ మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారా? లేకపోతె మాట తప్పుతున్నారా? అంటూ సరికొత్తగా వ్యాఖ్యలు చేసారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే వృద్ధాప్య పింఛను మరియు దాని అర్హతను పొందే 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు అధికారం లోకి వచ్చాక తగ్గిస్తాం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సమస్యల ఫై పవన్ కళ్యాణ్ వరుస ప్రశ్నలు సంధించారు.

జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల వలన ఎవరెవరు ఎంతగా నష్టపోయారో పూర్తిగా వివరించారు. వృద్ధాప్య పింఛను 2000 రూపాయల నుండి మూడు వేలకు పెంచుతాం అని చెప్పి, అధికారంలోకి వచ్చాక 2,250 రూపాయలు పెంచి 750 రూపాయలు లబ్ది దారుడు నష్టపోతున్నారని తెలిపారు. అయితే ఈ ఏడు నెలల్లో ఒక్కొక్క కొత్త లబ్ధిదారుడు రు. 15,700 కోల్పోయింది అని పవన్ తెలిపారు. 65 ఏళ్ల నుండి 60 కి చేయకపోవడం తో ప్రజలకి నష్టం చేకూరుతుందని పవన్ తెలిపారు.