Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పార్ట్ టైమ్ పొలిటీషియన్ అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ ను అందరూ గేలిచేస్తున్నారు. అయితే తాను పార్ట్ టైమ్ కాదు ఫుల్ టైమ్ పొలిటీషియన్ అని నిరూపించుకోవడానికి హార్ట్ కోర్ పాలిటిషియన్స్ మాదిరే రథయాత్రకు రెడీ అయ్యారు వైఎస్, చంద్రబాబు పాదయాత్ర చేసి అధికారం దక్కించుకున్నారని, తాను వారిలాగా పాదయాత్ర చేయలేకపోయినా.. కనీసం రథయాత్ర మాత్రం చేయాలని పవన్ ఫిక్సయ్యారట.
రథయాత్రకు ముహూర్తం కూడా రెడీ అయింది. పవన్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2 నుంచి తెలుగు రాష్ట్రాల్లో రథయాత్రకు రెడీ అవుతున్నారు పవన్. అటు జగన్ కూడా అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. దీంతో మొటిసారి ఎన్నికల ప్రచారానికి వెళ్లే ఛాన్స్ జనసేనకే దక్కబోతోంది. రథయాత్రను ధూమ్ ధామ్ గా చేయాలని జనసేన ఛోట లీడర్లు.
నిజంగా పవన్ రథయాత్ర చేస్తే అన్ని పార్టీలకూ సమస్యలు తప్పవు. పవన్ ఏదో కొన్నిచోట్ల సభలు పెడితేనే ఓఠుబ్యాంకును చీల్చాడని మాట్లాడుతున్నారు. ఇక రథయాత్ర చేస్తే.. ఓటు షేర్ మరింత పెరుగుతందని అంచనా ఉంది. కానీ పవన్ ఏ మరకు పాదయాత్ర చేయగలడని , ఆయన ఏదో ట్రైన్ ఎక్కుతారని చాలా మంది అనుకుంటున్నారు.