పవన్‌ పారితోషికం వాపస్‌ 

Pawan Kalyan Returned his Remuneration due to Agnathavasi Flop

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అని తేలిపోయింది. ఈ చిత్రంపై ఉన్న అంచనాల నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబ్యూటర్లు భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. సినిమా పెట్టుబడిలో కనీసం 50% కూడా వసూళ్లు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లను మరియు ఎగ్జిబ్యూటర్లను ఆదుకునేందుకు పవన్‌ ముందడుగు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. తన పారితోషికం నుండి 15 కోట్లను వెనక్కు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ 15 కోట్లను నిర్మాత ద్వారా డిస్ట్రిబ్యూటర్లకు అందేలా పవన్‌ చూస్తున్నాడు.

గతంలో కూడా పవన్‌ తన సినిమాల వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు నష్ట పరిహారం చెల్లించిన విషయం తెల్సిందే. తాజాగా అజ్ఞాతవాసి కారణంగా నష్టపోయిన వారికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంపై చిత్ర యూనిట్‌ సభ్యులు కాని, పవన్‌ సన్నిహితులు కాని బాహాటంగా ప్రకటించడం లేదు. నెల రోజుల తర్వాత డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టంను బట్టి వారికి నష్టపరిహారం చెల్లించాలని పవన్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్‌ 15 కోట్లు, త్రివిక్రమ్‌ 10 కోట్లు నిర్మాత రాధాకృష్ణ 15 కోట్లను డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు నష్టాలతో గుండెలు పట్టుకుంటున్నారు. వారికి కాస్త అయినా ఆదుకునే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు. డిస్ట్రిబ్యూటర్ల మేలు కోరి తన పారితోషికంను తిరిగి వెనక్కు ఇవ్వాలని నిర్ణయించుకున్న పవన్‌ మనస్సు ఎంత మంచిదో అంటూ ఫ్యాన్స్‌ గొప్పగా చర్చించుకుంటున్నారు.