Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావించిన పవన్ కళ్యాణ్ సినిమా రంగాన్ని వదిలేసి, ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అయ్యాడు. ఈ నెల 20 నుండి బస్ యాత్ర కూడా మొదలు పెట్టబోతున్నానని ప్రకటించాడు. అయితే తన యాత్రలో భాగంగా పలు చోట్ల ప్రసంగిస్తున్న పవన్ సదరు ప్రసంగాలలో మహేష్ డైలాగ్స్ పలకడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. తాజాగా కొరటాల శివ – మహేష్ బాబు కాంబినేషన్ లో భరత్ అనే నేను చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. పొలిటికల్ జోనర్ లోనే ఈ మూవీ తెరకెక్కడం జరిగింది. ఈ మూవీ లో మహేష్ తో ‘జవాబుదారీతనం’(అకౌంటబిలిటీ) అన్న పదాన్ని దర్శకుడు కొరటాల ముఖ్యమంత్రి పాత్ర చేత పదే పదే చెప్పించి, రాజకీయాలలో అది చాలా ముఖ్యమనే భావన ప్రజల్లోకి జొప్పించగలిగాడు.
అయితే ఇప్పుడు అదే పదం ‘జనసేన’ అధినేత నోట వస్తుండడం విశేషం. అంతకాక ఈనెల 20వ తారీఖు నుండి పవన్ చేపట్టబోతున్న బస్సు యాత్రకు సంబంధించి విడుదల చేసిన ప్రెస్ నోట్ లో మహేష్ ‘భరత్’ సినిమాలో పలుసార్లు పలికిన ‘పొలిటికల్ అకౌంటబిలిటీ’ పదాన్ని వాడటం గమనించిన మీడియా వర్గాలు సైతం ముక్కున వేలేసుకుంటున్నాయి. ఈ పదం జనసేన అధినేత మైండ్ లో ముందుగానే ఉంటె ఉండి ఉండవచ్చు గాక, అది ఇప్పుడు ఆయన నోటి నుండి బయటకు వస్తుండడం ఆసక్తికరంగా మారింది. దీనితో పవన్ బస్సు యాత్రలో మహేష్ ‘భరత్’ డైలాగ్స్ ఉంటాయేమోనని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. నిజానికి ఏ రాజకీయ పక్సాహం అధికారంలోకి వచ్చినా ‘జవాబుదారీతనం’ అనేది అలవడితే ఇక భారత దేశం అభివృద్ధి చెందుతున్న అని కాక అభివృద్ధి చెందిన దేశం అని చదువుకునే రోజు తప్పక వస్తుంది.