Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో జగన్ తో పోటీ పడుతున్నట్టు అనిపిస్తోంది. నిన్న మొన్నటి దాకా జగన్ ఏమి మాట్లాడినా ఊరికే దొరికిపోతుండే వాడు ఏదో ఒక చిన్న తప్పుతో, అయితే ఇప్పుడు అలా దొరికిపోవడం పవన్ వంతు అవుతోంది. ట్విట్టర్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తన సెల్ఫ్ గోల్ వేసుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తానెంత మేధావినో ప్రపంచానికి చాటుకునేందుకు చేసిన ప్రయత్నం ఆయన్ని కార్నర్ చేసి ఇప్పుడు నవ్వుల పాలు అయ్యేలా చేసింది. తను ఎంత మేధావినో చెప్పేందుకు సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన ప్రయత్నం ఇప్పుడు ఆయన్ను నవ్వుల పాలు చేఇస్న్ది.
దీంతో నెటిజన్లు పవన్ మీద జోకులు పేలుస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే… పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ట్విట్టర్ లో హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి వ్యవహారం తర్వాత ట్విట్టర్ లో ఎక్కువగా పోస్ట్ లు పెడుతున్న పవన్ తన భావాలను, ప్రత్యర్దుల మీద ఆరోపణలు సైతం ట్వీట్ల ద్వారానే వెల్లడిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా పవన్ ఓ ట్వీట్ చేశారు. ప్రముఖ న్యాయకోవిదుడైన నానీ ఫాల్కీవాలా రాసిన `వియ్ ద నేషన్: ది లాస్ట్ డికేట్స్’ అన్న న్యాయగ్రంథాన్ని తాను 1980లో చదివానని, 1980లో తనకు ఆ పుస్తకాన్ని లా విద్యని అభ్యసిస్తున్న తన సోదరుడు నాగబాబు దగ్గర చూసి చదివానని, ఆ విషయం నాగబాబుకి కూడా తెలియదని పేర్కొన్నారు. ఆ పుస్తకాన్ని చదివి అందులోని రాజకీయాన్ని అర్థం చేసుకుని – పెద్దయ్యాక రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అయితే పవన్ చెప్పిన ఈ పుస్తకం రాజకీయాలకి చెందినదే తప్పులేదు కాని ఆ పుస్తకం ఎప్పుడు ముద్రితం అయ్యిందో తెలుసుకున్న నెటిజన్లు పవన్ ని కార్నర్ చేయడం మొదలెట్టారు.
వికీపీడియా ప్రకారం పవన్ వయసు ఇప్పుడు 46 ఏళ్లు అంటే ఆయన 1971 లో పుట్టాడు, కానీ నానీ ఫాల్కీవాలా ఆ పుస్తకం రాసి విడుదల చేసింది 1994లో. అంటే 1994లో విడుదల అయిన పుస్తకాన్ని 80లలో ఎలా చదివారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పవన్ చిన్నతనంలోనే ఈ పుస్తకాన్ని ఎలా చదివారు? అసలు పుస్తకం విడుదలయిందే 1994లో అయితే పధ్నాలుగేళ్ల ముందే పవన్ దానిని ఎలా చదివారని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తానో విజ్ఞానఖని, పుస్తకాల పురుగు అని పవన్ తరచూ చెప్పుకునే పవన్ పాపం ఇలా పుస్తకాల విషయంలోనే దొరికిపోవడం కొసమెరుపు.