Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చూడు పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగను చూడు అని ప్రభుతో అంటాడు రజనీకాంత్ చంద్రముఖి సినిమాలో అదే విధంగా అసలు రాజకీయాలకి పనికి రాడు అనుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా మారిపోతున్నాడు. అయితే పవన్ మాటకు నిలకడ ఉండదు అనే మాట మాత్రం సార్ధకం చేసుకుంటున్నాడు. ఆవిర్భావ సభ అంటూ ఒక సభ పెట్టి చంద్రబాబు మీద యుద్దానికి కాలు దువ్విన పవన్ ఇప్పుడు చంద్రబాబు ని విమర్శిస్తూ కొత్త పంధాలో సాగుతున్నాడు. ముందు నుండి బాబు సమర్ధవంతమైన నాయకుడు కాబట్టే ఆయనకి మద్దతు ఇచ్చానని పేర్కొన్న పవన్ ఇపుడు మాత్రం ఓట్లు చీల్చడం ఇష్టం లేకనే మద్దతు ఇచ్చాను అంటున్నాడు. జనాలు నాలుగేళ్ళు మద్దతు ఇచ్చి ఇప్పుడు చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అని ఎక్కడ ప్రశ్నిస్తారోనని గంటకొక విమర్శ చేస్తూ ఆ లాజిక్ తో ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
ముందు విమర్శించాడు, పట్టించుకోలా తర్వాత అల్టిమేటాలిచ్చాడు అదీ పట్టించుకుంటారో లేదో తెలియని పరిస్థితి అందుకే చివరకు పశ్చాత్తాపం కూడా చెందుతున్నట్టు ప్రకటించాడు అనవసరంగా పోటీ చేయకుండా అగానని ఇప్పుడు బాధపడుతున్నానని ఇవన్నీ సరిపోతాయో లేదో అనుకున్నాడో ఏమో ఇప్పుడు సింపతీ యాంగిల్ కోసం ట్రై చేస్తూ చివరకు హత్యారోపణలు కూడా చేశారు. పవన్ ఇప్పుడు ఎంత ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడినా నాలుగేళ్ల పాటు చంద్రబాబు సర్కార్ చేసే ప్రతీ పనిని సమర్దిస్తూ వచ్చారన్నది నిజం, దీనిని ఎవరు మార్చలేరు ఎందుకంటే ఆయన మద్దతు ప్రకటించిన ప్రతి అంశం మీడియాలో హైలైట్ అయ్యేది. ఇప్పుడంటే మీడియాతో కావాలని కొర్రీ పెట్టుకున్నారు గానీ అప్పటిలో పవన్ ఇంటి నుండి అడుగుపెడితే చాలు మీడియా అంతా వాలిపోయేది. ఇప్పటికయినా పవన్ ఇలాంటి అర్ధం లేని విమర్శలు ఆరోపణలు ఆపి నిజంగా సర్కార్ ను నిలదీస్తే ఉపయోగం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.