Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మీడియాకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ట్విట్టర్ యుద్ధం కొనసాగుతోంది. టీవీ 9, టీవీ 5, ఏబీఎన్ చానళ్లను బహిష్కిరంచాలని పిలుపునిచ్చిన పవన్ …వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. శనివారం టీవీ 9 సీఈవో రవిప్రకాశ్ ను అజ్ఞాతవాసిగా అభివర్ణించిన పవన్…అనంతరం ఓ వ్యక్తి రవిప్రకాశ్ కాళ్లకు దండం పెడుతున్న వీడియోను పోస్ట్ చేసి దీనికి సమాధానం టీవీ 9లో ప్రసారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఉదయం నుంచి టీవీ 9తో పాటు ఏబీఎన్ పైనా…వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి, ఏబీన్ ఎండీ రాధాకృష్ణను ఉద్దేశిస్తూ బట్టలూడదీసి మాట్లాడుకుందాం-బట్టలూడదీసి కొడదాం కార్యక్రమానికి మీకు స్వాగతం. ఆర్కే నువ్వు నడిపే పేపర్ పేరు ఆంధ్రజ్యోతా..?
లేక టీడీపీ జ్యోతా..?ఎందుకంటే…అది ఆంధ్రులకు సంబంధించినదైతే కాదు..ఇలా ఎందుకంటున్నారో వచ్చే కొద్ది వారాల్లో స్పష్టత వస్తుంది అని ట్వీట్ చేశారు. ఇదే సమయంలో టీవీ 9 సీఈవో రవిప్రకాశ్ ను ఉద్దేశిస్తూ మరో ట్వీట్ ను పవన్ చేశారు. టీవీ 9 రవిప్రకాశ్ కు సంబంధించి మా గ్రౌండ్ స్టాఫ్ ఇచ్చిన లేటెస్ట్ అప్ డేట్ ఇది అంటూ మెసేజ్ పెట్టారు. టీవీ 9 సీఈవో రవిప్రకాశ్ పై చెప్పుతో దాడి పేరుతో ఓ పేపర్లో వచ్చిన కథనాన్ని అప్ లోడ్ చేశారు. కాసేపటి తర్వాత ఎల్లో మీడియాను బహిష్కరించండి అంటూ మరో ట్వీట్ చేశారు. మన తల్లులను, బిడ్డలను, సోదరీమణులను దూషిస్తున్న టీవీ9, టీవీ 5, ఏబీఎన్ లను బహిష్కరించండి. నగ్నత్వంతో, అమర్యాదకరంగా వ్యాపారం చేసుకుంటున్నందుకూ వాటిని మనం బహిష్కరించాల్సి ఉంది. నిస్సహాయురాలైన సోదరిని ఉపయోగించుకుని వ్యాపారం చేస్తున్నారు అని పవన్ ట్వీట్ లో విమర్శించారు. మరికొన్ని ట్వీట్స్ లో త్వరలోనే సరదాగా…కాలక్షేపం కోసం అరె ఓ సాంబ…హుకుం సర్దార్, ప్రోగ్రాం మీ ముందుకు రాబోతుంది. ప్రోగ్రాంలో సింపుల్ చిట్ చాట్, గాసిప్, ఫొటోస్, వీడియోస్ మొదలైన వాటితో పాటు స్టీమీ అఫైర్స్ కూడా మా సాంబాస్ వరల్డ్ లో ఉంటాయి అని ట్వీట్ చేశారు.