నేడు విశాఖపట్నంలో ఎస్.రాజా గ్రౌం డ్స్ లో జనసేన బహిరంగ సభ జరుగనుంది. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో పలువురు వ్యాపార ప్రముఖులు, రాజకీయ నాయకులు చేరనునన్నారు. ఇక, మధ్యాహ్నం నగరానికి జనసేన చీఫ్ రానున్నారు. ప్రస్తుతం రాష్ట్ర సమస్యలు, తుఫాన్ నష్టం , రైతులు పడుతున్న ఇబ్బందులు, తాజా రాజకీయాలపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారని పార్టీ వర్గాల వెల్లడించాయి. ఇప్పటికే ఆళ్వార్‌దాస్ మైదానంలో ఏర్పాటు పూర్తి అయ్యా యి. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు మైదానానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారన్నారు. మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రైతుల సమస్యలు, వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరాన్ని సభలో ప్రస్తావించనున్నారు. రాబోయే ఎన్నికలకు ఎలా సంసిద్ధం కావాలనే అంశం పై 100 రోజుల ప్రణాళికను ఆయన వివరించనున్నారు. ఇక, ఈ బహిరం గ సభ తర్వా త పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం జరగనుంది.
కాగా, తుఫాన్ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు వ్యాఖ్యలు చేశారు. తీవ్ర తుఫాన్ ముంచుకు వస్తుంది. అప్రమత్తత అవశ్యం .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మిచౌంగ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపించబోతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు. ఇది తీవ్ర తుఫాన్ అని రెడ్ అలెర్ట్ కూడా ఇచ్చారని పవన్ వెల్లడించారు. తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.