“బ్రో” పోస్టర్ వచ్చేసింది, అదరగొడుతున్న మామ అల్లుడు

"బ్రో" పోస్టర్ వచ్చేసింది, అదరగొడుతున్న మామ అల్లుడు
Bro poster

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ బ్రో. విలక్షణ నట దర్శకుడు సముద్ర ఖని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సినిమా రిలీజ్ డేట్గురించి అప్‌డేట్ ఇచ్చారు.

పవన్, సాయిధరమ్​ల లుక్​ను ఈ చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ పోస్టర్​లో మామాఅల్లుళ్లు సూపర్ హ్యాండ్సమ్​గా కనిపిస్తున్నారు. తమ్ముడు సినిమాలోని వయ్యారి భామ పాట లుక్‌లో పవన్, ప్యాంట్‌పైనే లుంగీతో సాయి ధరమ్ హ్యాండ్సమ్​గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్​ లుక్ అదిరిపోయింది.

ఈ సినిమాను జులై 28న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తమిళంలో విజయం సాధించిన ‘వినోదాయ సితం’ చిత్రానికి రీమేక్‌నే ఈ ‘బ్రో’ సినిమా. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తమిళంలో స్వీయ దర్శకత్వంలో నటించిన సముద్ర ఖని.. తెలుగు రీమేక్‌ను తెరకెక్కిస్తున్నారు